NTV Telugu Site icon

బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ స్పీచ్ హైలైట్స్

Bandla

Bandla

టాలీవుడ్ లో నటుడు నుండి నిర్మాతగా మారి గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన బండ్ల గణేష్ గురించి కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఇక ఆయన స్పీచెస్ కి మాత్రం ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మేధావులైన రైటర్స్ సైతం విస్తపోయేలా ఆన్ ద స్పాట్ పంచెస్ తో దంచేయడం బండ్ల గణేష్ స్పెషాలిటీ.గత కొంతకాలంగా సినిమా ఫంక్షన్స్ కి దూరంగా ఉన్న బండ్ల గణేష్ చాలాకాలం తర్వాత గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ప్రెస్ మీట్ కి అటెండ్ అయ్యారు. అంతేకాదు అదే వేదిక పై నుండి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇక దాంతో కావలసినంత స్టఫ్ దొరికింది సినిమా లవర్స్ కి, బండ్లన్న ఫ్యాన్స్ కి.

ఈ మధ్య సినిమాలు ఎందుకు తీయడం లేదు అని అడిగితే ”దరిద్రం తలుపు తట్టింది ఎప్పుడు లక్ష్మీదేవి తలుపు తడుతుంది కదా అని లక్ష్మీదేవి అనుకుని తీస్తే ఆరోజు దరిద్రం వచ్చింది” అని చెప్పి ఏమీ అర్థం కాకుండా ఆయన చెప్పాలనుకున్న ఆన్సర్ చెప్పేశారు. ఇక హీరోల గురించి మాట్లాడుతూ గబ్బర్ సింగ్ 5 నెలల్లో తీశాం. అలాగే ప్రతి హీరో కనీసం సంవత్సరానికి ఒక్క సినిమా అయినా కూడా థియేటర్లో రిలీజ్ అయ్యేలా తీస్తే బాగుంటుంది. అంతేకానీ 8 సంవత్సరాల ప్లానింగ్, ఐదు సంవత్సరాలు షూటింగ్ అంటే కష్టం – అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ కి, స్టార్ హీరోస్ కి అందరికీ కలిపివేసిన కౌంటర్ లా ఉంది. కానీ ఎక్కువ సినిమాలు వస్తే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా పని దొరుకుతుంది అనేది బండ్ల గణేష్ ఆలోచన.అలాగే గబ్బర్ సింగ్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి సినిమా రిలీజ్ అయ్యే వరకు బండ్ల గణేష్ దాన్ని ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా ఎంత నమ్మాడు అనేది హరీష్ శంకర్ మాటల ద్వారా అర్థం అయింది. చాలాకాలం తర్వాత సినిమా ఫంక్షన్ కి వచ్చిన బండ్ల గణేష్ సినిమా ఇండస్ట్రీని ఎంత మిస్ అవుతున్నాడు అనేది ఆయన మాటల్లో, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో కూడా క్లియర్ గా కనిపించింది.

హరీష్ శంకర్ కి ఈమధ్య ‘మిస్టర్ బచ్చన్’ ఎలాంటి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు హరీష్ శంకర్ ఆ విషయం గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ బండ్ల గణేష్ మాత్రం హరీష్ శంకర్ తరుపున తన వాయిస్ గట్టిగా వినిపించాడు. హరీష్ శంకర్ లో ఉన్న టాలెంట్ ని ఎలా వాడుకుంటే అలాంటి సినిమా ఇవ్వగలరని చెప్పాడు. అయితే మాటల మధ్యలో ఇంగ్లీష్ నిర్మాతలు ఇంగ్లీష్ మాట్లాడటం వల్ల వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఫ్లాప్ సినిమాలు తీస్తున్నారు అంటూ మరొక పంచ్ విసిరాడు. అంతే కాదు పూరీ జగన్నాథ్ కూడా బౌన్స్ బ్యాక్ అవుతాడని, మళ్లీ వరుస బ్లాక్ బస్టర్స్ తో సత్తా చాటుతాడని చెప్పుకొచ్చాడు. చిరంజీవి అవకాశం ఇస్తే హరీష్ శంకర్ డైరెక్టర్ గా చరిత్రలో నిలిచిపోయే బ్లాక్ బస్టర్ ఇస్తానంటూ ప్రామిస్ చేశాడు. అంతేకాదు గతంలో రిలీజ్ అయిన తీన్మార్ సినిమాని మళ్లీ పవన్ కళ్యాణ్ తో తీసి హిట్టు కొడతాను అంటూ కాస్త వెరైటీ స్టేట్మెంట్ కూడా పాస్ చేశాడు బండ్ల గణేష్.

ఇక N – కన్వెన్షన్ వివాదం, గతంలో పవన్ కళ్యాణ్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వంటి వాటిని మాత్రం సింపుల్ గా కట్ చేశారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేసారు బండ్ల గణేష్. ఆయన స్థాయి అది కూడా కాదు, అదేంటో మరికొన్ని సంవత్సరాల తర్వాత అర్థమవుతుంది అంటూ పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తన రక్తంలో కాంగ్రెస్ ఉందని, రాజకీయాల్లో మాత్రం కేవలం కాంగ్రెస్ లోనే కొనసాగుతానని, తనకి ఇష్టమైన వ్యక్తి చిరంజీవి అని, తనకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తనదైన స్టైల్ లో ఆసక్తికరమైన స్పీచ్ తో అందర్నీ అలరించాడు బండ్ల గణేష్.

హరీష్ శంకర్ కి ఈమధ్య మిస్టర్ బచ్చన్ ఎలాంటి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే ఇప్పటివరకు హరీష్ శంకర్ ఆ విషయం గురించి ఏమీ మాట్లాడలేదు కానీ బండ్ల గణేష్ మాత్రం హరీష్ శంకర్ తరుపున తన వాయిస్ గట్టిగా వినిపించాడు హరీష్ శంకర్ లో ఉన్న టాలెంట్ ని ఎలా వాడుకుంటే అలాంటి సినిమా ఇవ్వగలరని చెప్పాడు అయితే మాటల మధ్యలో ఇంగ్లీష్ నిర్మాతలు ఇంగ్లీష్ మాట్లాడటం వల్ల వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఫ్లాప్ సినిమాలో తీస్తున్నారు అంటూ మరొక పంచి విసిరాడు అంతే కాదు పూరీ జగన్నాథ్ కూడా బౌన్స్ బ్యాక్ అవుతాడని మళ్లీ వరుస బ్లాక్ బస్టర్స్ తో సత్తా చాటుతాడని చెప్పుకొచ్చాడు చిరంజీవి అవకాశం ఇస్తే హరీష్ శంకర్ డైరెక్టర్ గా చరిత్రలో నిలిచిపోయే బ్లాక్ బస్టర్ ఇస్తానంటూ ప్రామిస్ చేశాడు అంతేకాదు గతంలో రిలీజ్ అయిన తీన్మార్ సినిమాని మళ్లీ పవన్ కళ్యాణ్ తో తీసి హిట్టు కొడతాను అంటూ కాస్త వెరైటీ స్టేట్మెంట్ కూడా పాస్ చేశాడు బండ్ల గణేష్

ఇక ఎన్కన్వెన్షన్ వివాదం గతంలో పవన్ కళ్యాణ్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వంటి వాటిని మాత్రం సింపుల్ గా కట్ చేశారు అయితే ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ని పనిలో పనిగా ఆకాశానికి ఎత్తేశారు మండల గణేష్ ఆయన స్థాయి అది కూడా కాదు అదేంటో మరికొన్ని సంవత్సరాల తర్వాత అర్థమవుతుంది అంటూ పవన్ కళ్యాణ్ గురించి పవన్ పొలిటికల్ జర్నీ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు తన రక్తం లో కాంగ్రెస్ ఉందని రాజకీయాల్లో మాత్రం కేవలం కాంగ్రెస్లోనే కొనసాగుతానని తనకి ఇష్టమైన వ్యక్తి చిరంజీవి అని తనకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తనదైన స్టైల్ లో ఆసక్తికరమైన స్పీచ్తో అందర్నీ అలరించాడు బండ్ల గణేష్