Bandla Ganesh: టాలీవుడ్ నిర్మాత, ‘ఫైర్ బ్రాండ్’గా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోసం అంటూ ‘సంకల్ప యాత్ర’ పేరుతో ఒక పాదయాత్ర చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సమయంలో ఎంతకూ బెయిల్ రాకపోవడంతో, ఆయనకు బెయిల్ లభిస్తే కనుక.. తాను తన గడప నుంచి మీ గడప వరకు పాదయాత్ర చేస్తానంటూ తిరుమల శ్రీవారికి మొక్కుకున్నారట.
READ ALSO: Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఒక నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా?
ఇప్పుడు ఆ మొక్కు తీర్చేందుకు ఆయన తన సొంత ఊరైన షాద్‌నగర్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బయలుదేరి పాదయాత్రగా తిరుమలకు వెళుతున్నారు. అయితే, మొదటి నుంచి తనకు తాను ఒక కాంగ్రెస్ వాదిగా చెప్పుకుంటూ వచ్చిన బండ్ల గణేష్, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అధినేత కోసం పాదయాత్ర చేయడం ఒక కొసమెరుపు. ఈ పాదయాత్రకు వచ్చిన అతిథులు మరో ఆసక్తికర అంశం. సినీ పరిశ్రమ నుంచి నటుడు శివాజీ ముఖ్యఅతిథిగా హాజరవగా, తెలుగుదేశం పార్టీ నుంచి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, అలాగే కాంగ్రెస్ లోకల్ ఎమ్మెల్యే శంకర్ కూడా హాజరయ్యారు. ఇది మొత్తానికి ఒక ఆసక్తికరమైన పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే, ఒకప్పుడు నీరు-నిప్పులా ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల సమక్షంలో బండ్ల గణేష్ పాదయాత్ర ప్రారంభమవ్వడం విశేషం. ఇక ఈ పాదయాత్ర సుమారు రోజుకు 20 నుంచి 25 కిలోమీటర్ల మేర సాగబోతున్నట్లు బండ్ల గణేష్ పేర్కొన్నారు.
READ ALSO: Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఒక నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా?
