NTV Telugu Site icon

Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ..

Revanthreddy, Bandi Sanjay

Revanthreddy, Bandi Sanjay

Bandi Sanjay: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమని లేఖలో ప్రస్తావించారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను లేఖలో తెలిపారు బండి సంజయ్. ఒక్కో బాధిత కుటుంబానికి ఇండ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల 4 వేలు చెల్లించాలని వినతి అని పేర్కొన్నారు.

Read Also: CM Revanth: పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

నీలోజిపల్లి నుండి నందిగామ, ఆగ్రహారం వరకు ఇండస్ట్రీయల్ కారిడార్ ను, స్కిల్ డెవలెప్ మెంట్ కాలేజీని ఏర్పాటు చేయండని బండి సంజయ్ లేఖలో తెలిపారు. అర్హత లేకున్నా మిడ్ మానేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు సహా మాజీ సీఎం కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. తక్షణమే సంబంధిత శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని బండి సంజయ్ కోరారు. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ప్రజా అకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తూ, ప్రజాస్వామ్యబద్దంగా పనిచేయాలని బండి సంజయ్ సూచించారు.

Read Also: Congress PAC: పీఏసీ కన్వీనర్ సమావేశం.. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని తీర్మానం