Site icon NTV Telugu

Bandi Sanjay: కాంగ్రెస్ నాయకులలో హిందూ రక్తం లేదా?.. ఈ అంశాలను ఎందుకు ప్రశ్నించరు?

Bandi Sanjay

Bandi Sanjay

ఛావా సినిమాని అందరూ తప్పకుండా చూడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.. నూతన విద్యావిధానాన్ని తీసుకువస్తే తెలంగాణలో అమలుకు నోచుకోవడం లేదన్నారు.. కరీంనగర్ జిల్లా కేంద్రంలో‌ ఉపాధ్యాయుల ఆత్మీయ‌ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. “తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులది బిచ్చపు బతుకు‌ అయ్యింది. దీనికి కారణం బీఆర్ఎస్, కాంగ్రెస్. అన్ని బిల్లులు‌ పెండింగ్‌లో పెట్టి హరిగోస పెడుతున్నారు. మీ కోసం కొట్లాడుతున్నది బీజేపీ పార్టీ ‌మాత్రమే. పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. TNGO నాయకులని‌ బెదిరించిన చరిత్ర కేసీఆర్‌ది. పీఆర్సీ అమలుకు, డీఏ‌లు ఇవ్వడానికి పైసలు లేని పరిస్థితి ప్రభుత్వంది. కాంగ్రెస్ లో బడా కాంట్రాక్టర్ లే మంత్రులు. కమిషన్లు ఇస్తేనే బిల్లులు వస్తాయి. 317 జీవో కోసం కొట్లాడింది మేమే. మీ కోసం ‌మేము కొట్లాడితే ప్రజలు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కి ఓటు వేశారు.” అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.

READ MORE: Health Tips: జొన్నల్లో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు

“కులగణన చేసి ముస్లింలని తీసుకువచ్చి బీసీలలో కలిపారు. రాబోయే రోజులలో ఎవరి సమాజం వస్తదో ఆలోచించండి. కులగణన లో జనాభాని కావాలని తగ్గించి చూపారు. బీసీలకి కాంగ్రెస్ పార్టీ‌ ఇచ్చేది 32% మాత్రమే.. మిగితాది ముస్లింలకే దక్కుతుంది. ముస్లింలని తీసుకువచ్చి బీసీలలో కలపడం ఏమిటి? రంజాన్ కి ముస్లింలకి వెసులుబాటు ఇచ్చారు.. కాని అయ్యప్ప, హనుమాన్, దుర్గ దీక్షా పరులకి‌ ఎందుకు వెసులుబాటు‌ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ నాయకులలో హిందుత్వరక్తం లేదా? ఎందుకు‌ ప్రశ్నించడం లేదు.” అని బండి సంజయ్ ప్రశ్నించారు.

READ MORE: Hyundai : విద్యా రంగానికి రూ.3.38కోట్లు ఖర్చు చేస్తున్న హ్యుందాయ్

Exit mobile version