NTV Telugu Site icon

Bandi Sanjay : రజాకార్ల పాలనను తరిమికొడతా

Bandi

Bandi

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం వెంకటాపూర్ గ్రామంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అవిష్కరించారు. అయితే.. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. రజాకార్ల పాలనను తరిమికొడతానన్నారు. రామరాజ్యాన్ని స్థాపించేదాకా విశ్రమించబోనని ఆయన వ్యాఖ్యానించారు. ఊరూరా శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శివ లింగంపై మూత్రం పోయడానికి ప్రయత్నించిన మొగల్స్ ను తరిమికొట్టిన యోధుడు శివాజీ అని ఆయన వ్యాఖ్యానించారు. హిందూ ధర్మ కోసం పనిచేయడమే నాకు ముఖ్యమని, రాజకీయాల కోసం ధర్మాన్ని ఉపయోగించబోనని, ధర్మం కోసం రాజకీయాలు చేస్తానన్నారు. హిందూ మతం ఏ మతానికి వ్యతిరేకం కాదని, అయినా హిందూ ధర్మాన్ని కించపర్చడం కొంతమందికి ఫ్యాషన్ గా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఫాల్తుగాళ్లు హిందూ మతాన్ని కించపరిస్తే స్పందించకపోవడం అన్యాయమని, అయ్యప్పను, సరస్వతి అమ్మవార్లను కించపరిస్తే కనీసం నిరసన వ్యక్తం చేయకపోవడం బాధాకరమన్నారు బండి సంజయ్‌.

Also Read : Hansika Motwani: అది పెరగడానికి ఇంజక్షన్స్ తీసుకున్న హన్సిక.. ?

 

తెలంగాణలో హిందు దేవుళ్ల ను అపవిత్రం చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారు కావచ్చు …కానీ కాషాయ జెండా నీడలో పని చేసే మనం మాత్రం ఊరుకోమని రాష్ట్రం వ్యాప్తంగా అందరికి తెలుసు అని అని అన్నాడు. కండువా ఏది కప్పుకున్న పర్వాలేదు కానీ కాషాయ జెండా కి, హిందూత్వానికి విలువలు ఇవ్వాలని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాషాయ జెండా ఎగరాలని, దానికి కార్యకర్తలు, మండల నాయకుల కృషి తప్పని సరి ఉండాలని అన్నారు. వందేళ్లు బతకడం గొప్ప కాదని, బతికినన్ని రోజులు మాత్రం గొప్పగా దేశం , ధర్మం కోసం బతకాలని సూచించారు. మీరు కష్టపడి ఎంపీగా నన్ను గెలిపించారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినయ్యా.. తెలంగాణలో రజాకార్ల రాజ్యాన్ని పొలిమేరలదాకా తరిమికొట్టి మీరు కలలు కన్న రామరాజ్యాన్ని స్థాపించేదాకా విశ్రమించబోనని ప్రతిజ్ఞ చేస్తున్నా అని ఆయన అన్నారు.

Also Read : Phone In Toilet: టాయిలెట్‎లో ఫోన్ చూస్తే.. తప్పకుండా మీరక్కడికే