Site icon NTV Telugu

Bandi Sanjay : అడ్డదారిలో అధికారంలోకి రావాలని ఎప్పుడు అనుకోలేదు

Bandi Sanjay

Bandi Sanjay

తెలంగాణలో బీజేపీ నేతలు పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. రోజు రోజుకు తెలంగాణలో బీజేపీ బలపడుతుందనేది సర్వేల నివేదిక. అయితే.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండాలను ఎగురవేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు కమలనాథులు. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ నేతృత్వంలో మూడు రోజుల పాటు బీజేపీ శిక్షణ తరగతులను ప్రారంభించారు. తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్‌చుగ్‌ ఈ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ… అధికారంలోకి రావడానికి శిక్షణ అవసరమా అని కొంత మందికి అనుమానాలు రావొచ్చని, జనసంఘ్ నుంచి నేటి వరకు ప్రతి రెండేళ్లకు ఒకసారి శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయన్నారు.
Also Read : Church Pastor: పాస్టర్ వింత చేష్టలు.. దేవుడు ఆ పని చేయమంటున్నాడంటూ

పార్టీ అధికారంలోకి రావడమే ముఖ్యం కాదని, సిద్ధాంతం నమ్ముకుని రాజకీయాలు చేశామన్నారు. ఎన్నికల కమిషన్‌లో 7 వేల పార్టీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని ఆయన వెల్లడించారు. సిద్ధాంతం కోసం పార్టీ విస్తరణకు కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. బిజేపీ చరిత్ర, వికాసం, పరివార క్షేత్రాలు, దేశ ఆర్థిక వ్యవస్థ తదితర అంశాలను నిపుణులు వివరిస్తారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. సిద్ధాంతం నమ్ముకుని లక్ష్యాన్ని సాధించడం కోసం పాటుపడుతున్నామన్నారు. అడ్డదారిలో అధికారంలోకి రావాలని ఎప్పుడు అనుకోలేదని ఆయన వెల్లడించారు.
Also Read : Surya Kumar Yadav: సూర్యకుమార్ విధ్వంసం.. పాక్ కెప్టెన్ బాబర్ రికార్డ్ బ్రేక్

Exit mobile version