Site icon NTV Telugu

Bandi Sanjay Kumar: బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయించడం దుర్మార్గం..

Telangana Bjp President Bandi Sanjay Kumar Twitter

Telangana Bjp President Bandi Sanjay Kumar Twitter

Bandi Sanjay Kumar: ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయించడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫీజు బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు, సిబ్బంది ధైర్యంగా పోరాడాలని పిలపునిచ్చారు. 6 గ్యారంటీలు ఇస్తామని ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? మాట తప్పిన కాంగ్రెస్ నేతలపై విజిలెన్స్ దాడులు చేస్తారా? ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో 15 లక్షల మంది విద్యార్థులు అల్లాడుతున్నా సోయి లేదా? అని ప్రశ్నించారు. సర్టిఫికెట్లు రాక, ఉద్యోగాల్లో చేరలేక, ఉన్నత చదువులకు వెళ్లలేక విద్యార్థులు ఆందోళన పడుతున్నరన్నారు. నాలుగేళ్లుగా ఫీజు బకాయిలు చెల్లించకపోతే విద్యా సంస్థలు నడిచేదెలా? అధ్యాపకులకు జీతభత్యాలు, అద్దె, మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించేదెలా? అని నిలదీశారు. ఫీజు రీయంబర్స్ మెంట్ పథకానికి తూట్లు పొడుస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఫీజు బకాయిల కోసం ఎందాకైనా పోరాడాన్నారు. కాలేజీలు, విద్యార్థుల పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతిస్తుందన్నారు.

READ MORE: Komatireddy Venkat Reddy: మొంథా తుఫాను ఎఫెక్ట్.. తెలంగాణలో దెబ్బతిన్న 230 కి.మీ రోడ్లు..!

Exit mobile version