NTV Telugu Site icon

Bandi Sanjay : అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై స్పందించిన బండి సంజయ్‌

Bandi Sanjay Allu Arjun

Bandi Sanjay Allu Arjun

Bandi Sanjay : తెలుగు రాష్ట్రాల్లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌ సంచలనంగా మారింది. అయితే.. అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్‌ వేదికగా.. అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ను కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా నేరుగా బెడ్ రూం నుండి తీసుకెళ్లడం దుర్మార్గమైన చర్య, అగౌరవకరమని బండి సంజయ్‌ అన్నారు. భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఆయన స్థాయికి ఇది సముచితం కాదని ఆయన పేర్కొన్నారు.

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ సంచలన ట్వీట్

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ దుర్మరణం చెందడం చాలా దురదృష్టకరం, అయితే భారీ జనసందోహాన్ని అదుపు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఇది ఎత్తిచూపుతోందని, ‘పుష్ప: ది రైజ్’ అఖండ విజయం తర్వాత అభిమానులు ‘పుష్ప: ది రూల్’ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. ఇంతటి హైప్రొఫైల్ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడమే అసలైన వైఫల్యమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. ఐకాన్ స్టార్ , అతని అభిమానులు గౌరవం, క్రమశిక్షణకు మారుపేరు, గందరగోళానికి కాదని బండి సంజయ్‌ అన్నారు.

Mukunda Jewellers: హనుమకొండలో ‘ముకుంద జ్యువెల్లర్స్‌’ షోరూం రేపే ప్రారంభం

Show comments