Site icon NTV Telugu

Bandi Sanjay : నేడు బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్‌ దీక్ష

Bandi Sanjay

Bandi Sanjay

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు పార్టీ స్టేట్ ఆఫీసులో ఒక రోజు దీక్ష చేపట్టనున్నారు. దీక్షలో ఆయనతో పాటు మహిళా మోర్చా నేతలు పాల్గొననున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని, అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మహిళలకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పేందుకే బండి సంజయ్​ దీక్షకు దిగుతున్నారని తెలిపారు.

Also Read : Viveka Case: ఇవాళ సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు

ఇటీవల సీనియర్​ స్టూడెంట్​ సైఫ్​ వేధింపుల వల్ల మెడికో ప్రీతి చనిపోయిందని, ఇది ముమ్మాటికీ హత్యేనని, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్​లోని బషీర్​బాగ్​ నుంచి ట్యాంక్​ బండ్​ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా బండి సంజయ్​ సోమవారం దీక్ష చేపట్టనున్నారు.

Also Read : Astrology: మార్చి 06, సోమవారం దినఫలాలు

ఇదిలా ఉంటే.. నిన్న సీనియర్ వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన మెడికల్ పీజీ విద్యార్థి డా. ప్రీతి కుటుంబ సభ్యులను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పరామర్శించారు. ప్రీతి మరణానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. వారం రోజుల క్రితం ప్రీతి, ఎంజీఎంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా చూపారన్నారు. సైఫ్ అనే వ్యక్తి ర్యాగింగ్ చేసినట్లుగా చెప్పడం, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా స్పందించకుండా, కాలేజీ హెచ్ఓడీ ప్రీతినే బెదిరించడం చూశామన్నారు. ప్రీతి ఆత్మహత్య చేసుకునే పరికితనం ఉన్న అమ్మాయి కాదని, ఆమె ఫ్రెండ్స్ చెప్పారన్నారు. కానీ ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని, ఆధారాలన్నీ చెరిపేశారని ఆరోపించారు. లాక్ ఉన్న మొబైల్ ను ఎట్లా ఓపెన్ చేస్తారు? అని పోలీసులను ఈ సందర్భంగా సంజయ్ ప్రశ్నించారు.

Exit mobile version