NTV Telugu Site icon

Bandi Sanjay : తెలంగాణ ప్రజలు తెలివి లేకనే పది సంవత్సరాలు మీకు అధికారం కట్టబెట్టారా

Bandi Sanjay

Bandi Sanjay

కరీంనగర్ లోని డ్రైనేజీ త్రాగునీరు సమస్యలను తెలుసుకునేందుకు 21వ డివిజన్‌లో ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పర్యటించారు. 21 డివిజన్‌లో డ్రైనేజీ వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బండి సంజయ్‌ అన్నారు. బోర్ నీళ్లలో కూడా డ్రైనేజీ వాటర్ కలవడంతో నీరు దుర్వాసన కొడుతోందని ఆయన వెల్లడించారు. కార్పొరేషన్ పరిధిలోనే ఉన్న 21వ డివిజన్లో అభివృద్ధి పనులను కార్పొరేషన్ ఆదిమరిచిందన్నారు. 21 డివిజన్ పాకిస్తాన్లో ఉందా బంగ్లాదేశ్ లో ఉందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్పొరేషన్ లో మిషన్ భగీరథ నీటి సప్లై ఉందంటూ కేసీఆర్ కేటీఆర్ వ్యాఖ్యలు అబద్ధమని, కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులలో పొట్టు పొట్టుగా పైసలు దండుకున్నారు బీఆర్ఎస్ నాయకులు అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు తెలివి లేనోళ్ళంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్‌ మండిపడ్డారు. తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన అమరవీరులను అవమానించిన కేటీఆర్.. తెలంగాణ ప్రజలు తెలివి లేకనే పది సంవత్సరాలు మీకు అధికారం కట్టబెట్టారా.. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కళ్ళు తెరిచి పార్లమెంట్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలన్నారు.

తెలంగాణ ప్రజలను తెలివిలేనోళ్లంటావా? కొట్లాడి తెలంగాణ సాధించి అధికారమిస్తే…తెలివిలేనోళ్లంటావా? తెలంగాణ సొమ్మును దోచుకుని తెలివిలేనోళ్లంటావా? అమెరికాలో చిప్పలు కడిగిన నిన్ను మంత్రి చేస్తే ఇదేనా నువ్విచ్చే బహమతి? తెలంగాణ ప్రజలారా… బీఆర్ఎస్ ను ఈడ్చి తన్నండి.. తెలివిలేనోళ్లు మాత్రమే బీఆర్ఎస్ కు ఓటేయండి… తెలివి ఉన్నోళ్లెవరూ బీఆర్ఎస్ కు ఓటేయకండి.. బీఆర్ఎస్ కార్యకర్తలారా… మీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే ‘క్విట్ బీఆర్ఎస్‘ అని బండి సంజయ్‌ అన్నారు.