Site icon NTV Telugu

Bandi Sanjay : నెహ్రూ అమలు చేసిన బానిసత్వ మరకలను తుడిచివేయాలి

Sanjay Bandi

Sanjay Bandi

కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రలో బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ.. నెహ్రూ అమలు చేసిన బానిసత్వ మరకలను తుడిచివేయాలని, అంబేద్కర్ గొప్ప రాజ్యాంగం అందిస్తే… రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ అనేక పాపాలను యాడ్ చేసిందని ఆయన మండిపడ్డారు. మైనారిటీ సంతూష్టీకరణ విధానాలే దేశ అనిశ్చితికి కారణమని ఆయన ధ్వజమెత్తారు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందిస్తే… అందులో కాంగ్రెస్ అనేక పాపాలను జత చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ చేసిన పాపాలను బీజేపీ కడిగే పని చేస్తే తప్పుపడతారా? అని ఆయన బండి సంజయ్‌ అన్నారు.

Delhi: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 150 మంది మహిళా సర్పంచ్‌లు!..ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా?

అంతేకాకుండా.. వక్ఫ్ బోర్డు బిల్లుకు నెహ్రూ, పీవీ, మన్మోహన్ హయాంలో సవరిస్తే తప్పులేదట అని, ఆ తప్పులను సరిదిద్దేందుకు మోదీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తెస్తే తప్పుపడతారా? అని ఆయన ప్రశ్నించారు. మతం పేరుతో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర అని ఆయన అభివర్ణించారు. పంద్రాగస్టున జెండా, ఎజెండాను పక్కనపెట్టి మువ్వెన్నెల జెండాను ప్రతి ఇంటిపై ఎగరేయండని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ జెండాను చేతపట్టని వాడు భారతీయుడే కాదని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయవాద భావజాలంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని, నేటి నుండి పంద్రాగస్టుదాకా ప్రతి ఒక్కరి ఫోన్ వాట్సప్ లో మువ్వెన్నెల జెండాను డీపీలుగా పెట్టండన్నారు బండి సంజయ్‌.

AP Police: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే పోలీస్ శాఖలో కొలువుల భర్తీ!

Exit mobile version