Site icon NTV Telugu

Bandi Sanjay : నీ బండారం బయట పెడితే పబ్లిక్‌లో తిరగలేవు కేసీఆర్‌

Bandi Sanjay Bjp

Bandi Sanjay Bjp

సీఎం కేసీఆర్‌ నిన్న మీడియా సమావేశం నిర్వహించి మొయినాబాద్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై వీడియోలు విడుదల చేశారు. అంతేకాకుండా.. బీజేపీ అగ్రనేతలతో పాటు అవలంభిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ పేదల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. వేల కోట్లు సంపాదించారని, ఇదంతా కామెడీ షో అని, చికోటి ఫైల్స్, డ్రగ్స్ ఫైల్స్, కాళేశ్వరం ఫైల్స్ అన్ని బయటకు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Big Breaking: టీడీపీ రోడ్ షోలో ఉద్రిక్తత.. చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడి

కొంప ముంచుట్లో కేసీఆర్‌ పక్కా అని ఆయన అన్నారు. కొప్పుల ఈశ్వర్ చాలా మంచి వ్యక్తి… ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భయంతో నాతో మాట్లాడ్డం లేదని, కొప్పుల ఈశ్వర్ కి డిప్యూటీ సీఎం ఇద్దామని అనుకుంటే కేటీఆర్ అడ్డుకున్నది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. నీ బండారం బయట పెడితే పబ్లిక్ లో తిరగ లేవు కేసీఆర్‌ అంటూ బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు. మోడీ తో పోల్చుకుంటున్నావు.. నీ బిడ్డ లిక్కర్ స్కీమ్ గురుంచి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. మేము తప్పు చేయలేదు కాబట్టే యాదాద్రి లో ప్రమాణం చేసిన.. కేసీఆర్‌ నువ్వు ఎందుకు రాలేదని ఆయన మండిపడ్డారు.
వాళ్ళు నకిలీ గాంగ్, ఎమ్మెల్యే లు ఆణిముత్యాలు అని బండి సంజయ్‌ సంబోధించారు. బిడ్డను కాపాడుకోవడం కోసమే ఇదంతా కేసీఆర్‌ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Exit mobile version