ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత ప్రారంభం అవుతోంది. బీజేపీ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను ఆయన వివరించారు. ఆగస్టు 2 నుంచి 20 రోజుల పాటు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ పాదయాత్ర ఎన్నికల కోసం కాదు, ప్రజలకు భరోసా ఇవ్వడానికే ఈ యాత్ర చేపడుతున్నాం. ప్రజల బాధల్ని పట్టించుకునే వారు లేరు. ఫాం హౌస్‌లోనే కేసీఆర్ వుంటున్నారు.
బాధ్యత గల పార్టీగా మేం యాత్ర చేపడుతున్నాం. ప్రజలకు ధైర్యం చెబుతాం, వరద బాధితుల్ని ఎంతమందిని కలిశారు. గవర్నర్ పర్యటనకు వెళతానని చెప్పడంతో సీఎం కేసీఆర్ వెళ్ళాల్సి వచ్చింది. గతంలో కేసీఆర్ ప్రగతి భవన్ కు నీళ్ళు వచ్చినా పట్టించుకోలేదు. వరంగల్, హైదరాబాద్ లో వరదలు వచ్చాయి. ఎన్నో కుటుంబాలు నష్టపోయాయి. కానీ కేసీఆర్ పట్టించుకోలేదు. కేంద్రం ఇచ్చింది, మీరు ఇచ్చింది, మీరు ఏం వాడారో కేసీఆర్ చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వాలి.
ఐదు గ్రామాలను దమ్ముంటే తెలంగాణకు ఇప్పించమంటున్నారు. తెలంగాణ ఉద్యమం టైంలో ఒకలా.. ఇప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారు. ఈడీ గురించి మాట్లాడితే భయపడుతున్నారు. కేసీఆర్ కుటుంబం మదిలో ఈడీ …ఈడీ వినపడుతోంది. తరతరాలకు సరిపోయేలా సంపాదించారు. డబుల్ ఇంజన్ అంటే మోడీ, ఈడీ అనే భావన వారిలో వుంది. ఈడీని అక్రమంగా వినియోగించుకునే స్థితిలో మేం లేం. మేం కోర్టు ద్వారా కొట్లాడతాం. కాంగ్రెస్ ఆందోళన చేస్తోంది. మోడీ, అమిత్ షా గతంలో ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ అవినీతిపై కొట్లాడాలి. ఈడీ వస్తుందని నేను చెప్పలేదన్నారు బండి సంజయ్. ఈడీ అంటే వారికే భయం వుంటే నేనేం చేస్తా. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీచేస్తాయి, రేపు కేసీఆర్ అవినీతిపై విచారణ ప్రారంభం అయితే రెండుపార్టీలు కలిసి పోరాడతాయన్నారు బండి సంజయ్.
Hyderabad Crime: మూసీలో మృతదేహం.. రెండు నెలల వ్యవధిలో నాల్గొవది
ఆర్టీఐ కింద అనేక అంశాలపై దరఖాస్తులు పెట్టాం. ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలపై విచారణ ఏమైందన్నారు. ఒక్కో ఎమ్మెల్యే 2014లో ఇచ్చిన అఫిడవిట్లు, 2018లో ఇచ్చిన అఫిడవిట్లలో ఎంత తేడా వుందో చూడండి. అంత సంపాదన ఎలా వచ్చింది. కేంద్రంలో అధికారంలో వుంది కాబట్టి ఈడీవచ్చిందంటారు. నేను ఫోన్ చేస్తే ఈడీ రాదు. నాపై విచారణ చేయండని, ఈడీకి లెటర్ రాయండి. వాళ్ళు తప్పు చేయలేదు, నిజాయితీ పరులు కదా వారే లెటర్ రాయమనండి. నన్ను బీజేపీ కించపరుస్తోంది, నాపై విచారణ చేయండని మంత్రి కేటీఆర్ కోరవచ్చు కదా అన్నారు బండి సంజయ్. నిప్పు లేనిదే పొగరాదు కదా. గ్లోబరీనా సంస్థ గురించి నేను ఆరోపణలు చేశా. సంబంధం లేకుంటే.. విచారణ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. 27 మంది విద్యార్ధుల ఉదంతంపై వాస్తవాలు బయటపెట్టాలన్నారు బండి సంజయ్. బాధ్యత వహించాల్సింది మంత్రులు, సీఎం.
బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్కయిందని ఆరోపణలపై బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోరాడతారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కలిసి పనిచేశారు. రేవంత్ రెడ్డి వెళ్లి ఈడీ ఆఫీసుకి వెళ్లి ఫిర్యాదుచేస్తే వచ్చేస్తారా? దొంగల్ని తప్పించడానికి కాంగ్రెస్ చేస్తున్న పన్నాగం అన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు ఒక్కో రాష్ట్రానికి ఇస్తారు, మాకు అవకాశం ఇచ్చారు. అధికారంలోకి వస్తామని చెప్పడం ఆత్మవిశ్వాసం. మోడీ నాయకత్వంలో తెలంగాణలో అధికారంలోకి వస్తాం. కుటుంబ పాలన అంతం చేయడానికి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సిద్ధంగా వున్నారు.
ఆయన పార్టీలో చేరతారా లేదా అనేది నాకు తెలీదు. బండి సంజయ్ పై వ్యతిరేకత లేదు. మంత్రి శ్రీనివాస్ ని తప్పించడం అనేది పార్టీ వ్యవహారం. అటువంటి వ్యక్తులమీద కామెంట్లు చేయవద్దు. మా ఇద్దరి మధ్య ఏంలేదు. మేం కలిసి పనిచేశాం. నడ్డాగారిని అడిగి సీఎం ఎవరో చెబుతారు. వ్యక్తిగతంగా పదవులు నిర్ణయించే పార్టీ కాదన్నారు. మాలో వర్గాలు ఏం లేవు. అంతా కలిసి పనిచేస్తున్నాం. కమిటీలు వేసి అన్నీ నిర్ణయించుకుంటున్నాం. ఇన్ని కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయన్నారు. మాది కాషాయ జెండా. మాది ఒకటే అజెండా. ఎస్టీ ఆడబిడ్డకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తే టీఆర్ఎస్ ఎందుకు మద్దతు ఇవ్వలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.