NTV Telugu Site icon

Bandi Sanjay : నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాల్సిందే

Bandi Sanjay, Ktr

Bandi Sanjay, Ktr

టీఎస్సీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం కన్పిస్తోంది. ఆయన కొడుకు నిర్లక్ష్యంవల్లే తప్పిదం జరిగింది. వెంటనే ఆయన కొడుకును బర్తరఫ్ చేయాలి. బీఆర్ఎస్ లో ఇతరులు తప్పు చేస్తే గెంటేస్తారే… మరి కేసీఆర్ ఫ్యామిలీ తప్పు చేస్తే చర్యల్లేవవా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీవల్ల నష్టపోయిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మిలియన్ మార్చ్ తరహాలో అతి త్వరలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగ నియామకాల్లోనే పెద్ద కుట్ర కన్పిస్తోందని వ్యాఖ్యానించారు. ఈరోజు సిద్దిపేటలో ఓ ప్రైవేటు ఫంక్షన్ కు విచ్చేసిన బండి సంజయ్ ను మీడియా ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా సంజయ్ విలేకర్లతో మాట్లాడుతూ ‘టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ సీఎం ఆఫీస్ నుండే జరిగింది. సీఎంఓలో పదవీ విరమణ పొందిన ప్రధాన అధికారి పాత్ర ఈ పేపర్ లీకేజీలో ఉంది.

Also Read : Allari Priyudu Movie: రాజశేఖర్ ఇమేజ్‌ను మార్చేసిన ‘అల్లరి ప్రియుడు’!

సింగరేణి ప్రశ్నాపత్రాల నియామకాల్లోనూ ఆయన పాత్ర ఉంది. సదరు అధికారి టీఎస్పీఎస్సీలో ముగ్గురు వ్యక్తులను నియమించే సమయంలోనూ ఆయన పాత్రే ఉంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో పెద్ద గూడుపుఠాణి ఉంది. ఈ విషయంపై విచారణ చేసిన పోలీస్ అథికారి రెక్కి చేసి నిందితులను దొరకపట్టిన తరువాత కూడా…. బయట ఎక్కడ ఈ విషయం చెప్పినా నీ సంగతి చూస్తామని ఒక అమ్మాయిని బెదిరించాడు. కచ్చితంగా సీఎంఓలో పనిచేసే అధికారి హస్తం ఉంది… దీనిని మాయమార్చేందుకే ఇదంతా.. ఇందులో సీఎంకు ఏటీఎంలా మారిన వాళ్లందరి పాత్ర బయట పడుతోంది. ఆశ్చర్యేమేమిటంటే..చేయించింది మీరే.. తప్పించుకునేది మీరే… దీనిపై పక్కా విచారణ జరపాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలే.. సీఎం కొడుకు పాత్రపైనా ఎంక్వైరీ జరపాలే. నిరుద్యోగులకు లక్ష పరిహారం ఇవ్వాలే. లేనిపక్షంలో.. మిలియన్ మార్చ్ మాదిరిగా నిరుద్యోగ మార్చ్ చేస్తామని ఆయన అన్నారు.

Also Read : Shriya: ఎలా శ్రీయా.. ఇంత అందాన్ని మెయింటైన్ చేస్తున్నావ్…

Show comments