ఎవరేమి కామెంట్స్ చేసినా.. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి అని…హుజురాబాద్ లో బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. హుజురాబాద్ లో బీజేపీ గెలుపు ఊహించినదేనని..హామీలు అమలు చేయటంలో కేసీఆర్ విఫలం అయ్యారని నిప్పులు చెరిగారు.
ఈటల రాజేందర్ మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని.. ఓటర్లను టీఆర్ఎస్ భయభ్రాంతులకు గురిచేసినా ఫలితం లేకపోయిందన్నారు. డబ్బును కాదని చైతన్యాన్ని చాటిన హుజురాబాద్ ప్రజలకు ధన్యవాదములు తెలిపారు బండి సంజయ్. టీఆర్ఎస్ పార్టీ తో విరోచిత పోరాటం చేసిన బీజేపీ కార్యకర్తలకు హ్యాట్సాఫ్ చెప్పారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు బండి సంజయ్. కాగా.. హుజురాబాద్ లో ఐదో రౌండ్ లోనూ ఈటల రాజేందర్ లీడ్ లో ఉన్నారు.
