నన్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కయ్యాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టండని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశమంతా మోడీ గాలి వీస్తోందని, మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ మధ్యే ఎన్నికల వార్ అని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం మోడీ ప్రభుత్వమే కొనసాగాలనుకుంటున్నారని, రాష్ట్రంలో ఖజానా ఖాళీ.. జీతాలకు డబ్బులిచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. బీజేపీ ఎంపీలను గెలిపిస్తేనే తెలంగాణకు అత్యధిక నిధులు తీసుకొచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. జాయినింగ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టండని బీజేపీ మండల ఇంఛార్జీలకు దిశానిర్దేశం చేశారు బండి సంజయ్.
Tarun Joshi : రేపు హైదరాబాద్- ముంబై మధ్య మ్యాచ్.. భారీ బందోబస్తు
కాగా చెంగిచర్లలో మహిళలపై దాడి ఘటనపై బండి సంజయ్ స్పందిస్తూ… తెలంగాణలో హిందువులు ప్రమాదంలో ఉన్నారని.. కాంగ్రెస్ వాగ్దానం చేసిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా అంటూ ప్రశ్నించారు. హిందువులు శాంతియుతంగా పండుగలు జరుపుకోలేదా? చెంగిచెర్ల వద్ద బాధితులపై పోలీసులు లాఠీ ఛార్జ్ ఎలా చేస్తారు? రజాకార్ల వారసులు, సంఘ వ్యతిరేక శక్తులు హిందువులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. గత బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ హయాంలో కూడా హిందువుల పై దౌర్జన్యం కొనసాగుతోందని బండి సంజయ్ ఆరోపించారు.
Prashanthi Harathi: టాలీవుడ్ రీ ఎంట్రీకి రెడీ అయిన పెళ్ళాం ఊరెళితే నటి..