NTV Telugu Site icon

Bandi Sanjay : బంగ్లాదేశ్ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది

Sanjay Bandi

Sanjay Bandi

మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం రాంపూర్ గ్రామంలో సరస్వతి విద్యా మందిర్ నూతన భవన నిర్మాణానికి కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. దేశ పరిణామాలపై అవగాహన లేకపోతే విచ్చిన్నమయ్యే ప్రమాదం ఉంది.. బంగ్లాదేశ్ లో సంక్షోభమే నిదర్శనమన్నారు. దేశభక్తి, ధర్మాన్ని బోధించడంతోపాటు దేశ పరిణామాలపై చర్చలో శిశు మందిర్ భేష్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ విద్యా వ్యవస్థలో నక్సల్ భావజాలం చొప్పంచే కుట్ర జరుగుతోంది… మన చరిత్ర, సంస్క్రుతిని మరుగుపడే ప్రమాదముందని, బంగ్లాదేశ్ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు బండి సంజయ్‌. బంగ్లా దేశ్ లో వాళ్ల డిమాండ్లు న్యాయమైందే కావచ్చు. కానీ వాళ్ల వెనుకుండి నడిపిస్తున్న వాళ్ల ప్రయోజనాలేమిటి? దీనివల్ల దేశానికి జరిగే నష్టమేమిటి? అనే అంశాలపై అక్కడి యువత, విద్యార్థుల్లో అవగాహన కల్పించలేకపోవడంవల్లే ఆ దేశం నేడు క్లిష్టపరిస్థితుల్లో ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి శిశు మందిర్ భవనాన్ని నూతనంగా నిర్మించేందుకు పూర్వ విద్యార్థులే ముందుకు రావడం గొప్ప విషయమని ఆయన తెలిపారు. విద్యా సంస్థ కోసం 33 ఎకరాలిచ్చిన దాతలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఈ భవన నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నా అని ఆయన అన్నారు. నాలో రాజకీయ నేత కావాలనే స్కిల్స్ ఉన్నాయని గమనించి శిశు మందిర్ లో ప్రోత్సహించడంవల్లే నేను ఈ రోజు ఈస్థాయికి ఎదిగినట్లు ఆయన తెలిపారు.

  Minister Seethakka : పండగపూట రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారు

అంతేకాకుండా.. ‘బీఆర్ఎస్ తో పది సంవత్సరాలు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆరు గ్యారంటీల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చర్చే లేదు. బుణా మాఫీ విషయంలో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఒక్కో విద్యార్థికి 32వేలు కాంగ్రెస్ పార్టీ బాకీ ఉంది. పార్టీ విలీనాలను ప్రజలు పట్టించుకోవడం లేదు. కేసీఆర్ దగ్గర కాంగ్రెస్ వాళ్లు శిక్షణ పొందారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద బిఆర్ఎస్ లక్షల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఫోర్త్ సిటీ పేరు మీద దోచుకునేందుకు చూస్తున్నారు. కాంగ్రెస్, బిజెపి రెండు ఒక్కటే. జస్ట్ మిస్ ప్రభుత్వం మాదే. ఇటు వేయాల్సిన ఓటు, అటు కాంగ్రెస్ కు వేశారు. కేసీఆర్ కొడుక్కి కండకావరం దిగలేదు. కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని కొరుకుంటున్న. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పేరు రాసి ఉన్న ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కాబోతుంది. కేంద్ర పథకాల పై ఇందిరమ్మ ఫోటో పెట్టుతే ఊరుకోం, ప్రధాని బొమ్మ పెట్డవలసిందే. మూసి నది పక్షాలన పేరుతో లక్షలకోట్లు దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది.’ అని బండి సంజయ్‌ అన్నారు.

UP video: స్కూటీపై వెళ్తుండగా యువతికి పోకిరీలు వేధింపులు.. వీడియో వైరల్