NTV Telugu Site icon

Bandi Sanjay: రాష్ట్ర అధ్యక్ష పదవి పోతే పోనీ.. మంచిదే అయ్యింది..

Bandi Sanjay

Bandi Sanjay

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నియోజకవర్గ స్థాయి విసృత సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కోడుకు కాకుంటే కేటీఆర్ ని ఎవరు దేకరు అని ఆయన అన్నారు. కేటీఆర్ భాష, అహంకారం చూసి వాళ్ళ పార్టీ వాళ్ళే సిగ్గుపడుతున్నారు.. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు అందుకే వాళ్లని అరెస్టు చేయరు.. బీజేపీ వాళ్ళనే అరెస్టు చేస్తారు అని బండి సంజయ్ అన్నారు.

Read Also: Skanda Trailer: రామ్ నట విశ్వరూపం.. బోయపాటి మాస్ మార్క్.. థియేటర్ దద్దరిల్లడమే

కేసీఆర్ బిడ్డ, కోడుకు, అల్లుడు ఆస్తులు ఎంతో స్పష్టం చేయగలరు?.. అన్నిటికీ మేమే ఇస్తున్నామంట్టున్నారు.. కానీ, ఎమ్ ఇస్తాలేరు.. సిరిసిల్ల సెస్ ఎలక్షన్ లో అడ్డదారిలో గెలిచారు.. నైతిక విజయం బీజేపీదే.. ఆ గెలుపు ఓ గేలుపెనా.. ప్రజలు భారతీయ పార్టీకి అనుకూలంగా ఉన్నారు.. బీఆర్ఎస్ పైన వ్యతిరేఖంగా ఉన్నారు అని ఆయన వ్యాఖ్యనించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్తారని భయంలోనే టిక్కెట్లు ప్రకటించిండు.. కేసిఆర్ ఎలక్షన్ వచ్చే సరికి సగం మందికి టిక్కెట్లు ఇవ్వడు అని బండి సంజయ్ ఆరోపించారు. గెలిచే అభ్యర్థులకు పైసలు పంచుతాడు కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కూడా పంచుతాడు అని అన్నాడు.

Read Also: Mallikarjun Kharge: తెలంగాణ నా వల్లే వచ్చిందంటూ ఆయన చెప్పుకుంటున్నారు..

రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కలిసి పని చేసారు అని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పోతే పోనీ.. మంచిదే అయ్యింది.. కార్యకర్తలకు దూరం అయ్యాను.. ఇక నుంచి అందరికీ అందుబాటులో ఉంటూ కార్యకర్తల కష్ట సుఖల్లో పాలు పంచుకుంటాను అని ఆయన పేర్కొన్నాడు. ఎన్ని కేసులు వుంటే అంతా మంచిది.. మన మీద కేసులు వుంటే మనం ఏ ధర్నాలు చేసారని అడుగుతారు.. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పైనా కేసులు అయితే ఎమ్ దోచుకున్నారని అడుగుతున్నారు.. అందరు పార్టీ కోసం పని చేయాలి.. ఎవరైన క్రమశిక్షణ తప్పితే చర్యలూ కఠినంగా వుంటాయి.. వ్యక్తి కోసం కాదు పార్టీ కోసం పని చేయండి అందరూ అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Read Also: Karthikeya: హీరోను బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతి.. ఆ పని చేయకపోతే చెయ్యి కోసుకుంటా అంటూ

ఇంటలిజెన్స్ వర్గాల రిపోర్ట్స్ కూడా బీజేపీ గెలుస్తాయని చెప్పిందని బండి సంజయ్ అన్నారు. అందరూ కలిసి యుద్ధం చేస్తే మనం అధికారంలోకి వస్తాం.. అధికారంలోకి రాగానే చేనేత రంగానికి సెస్ నుండి సబ్సిడీ ఇస్తాం.. చంద్రయాన్-3 సక్సెస్ అయ్యిందని దేశం మొత్తం సంతోష పడితే.. కేసీఅర్ చంద్రమండలంలో దందా ఎట్లా చేయాలి అనుకుంటాడు అని ఆయన వ్యాఖ్యనించారు. రిపోర్టర్లు ధైర్యంగా వుండండి. ఉడుత ఊపులకు భయపడకండి.. మీకు హెల్త్ కార్డులు ఇస్తాం.. ఇండ్లు ఇస్తాం.. జర్నలిస్ట్ ల సమస్యలను పరిష్కరిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.