మొయినాబాద్ ఫాం హౌస్ ఘటనతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. తడిబట్టలతో ఆలయానికి చేరుకున్న బండి సంజయ్ స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేయడానికి రెడీ అయ్యారు. అయితే, బండి సంజయ్ పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే మొయినాబాద్ (Moinabad Farm House) ఎపిసోడ్‌లో తన పాత్ర లేదని.. ప్రమాణం చేయాలని సీఎం కేసీఆర్ (CM KCR)కు బండి సంజయ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. యాదాద్రిలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలోనే యాదాద్రిలో హై టెన్షన్ చోటు చేసుకుంది. ఫాం హౌస్ డీల్ తమది కాదని ఆయన స్వామివారి పాదాల దగ్గర ప్రమాణం చేశారు.
Read Also: Breaking : మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనలో బయటికొచ్చిన ఆడియో.. వర్డ్ టు వర్డ్..
పోలీసు ఆంక్షలు వున్నా బండి సంజయ్ తడిబట్టలతో స్వామివారి ముందు ప్రమాణం చేశారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో రెండు రోజుల క్రితం నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. మునుగోడులో ఫిరాయింపుల కోసం ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నలుగురు TRS ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే దీనికి బీజేపీకి సంబంధం లేదని, ఇదంతా టీఆర్ఎస్ ప్లాన్ అని ఆరోపించారు బీజేపీ నేతలు. వందలాదిమంది యాదాద్రి టెంపుల్ కి చేరుకోవడంతో అక్కడ కోలాహలం నెలకొంది.
Read Also: Hello Meera: హరీష్ శంకర్ ఆవిష్కరించిన ‘హలో మీరా’ టీజర్