NTV Telugu Site icon

Bandi Sanjay : జాతీయ భావాలు ఉన్న వ్యక్తి దాసోజు శ్రావణ్

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay About komatireddy rajgopal reddy bjp join

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామయాత్ర మూడో దశ పాదయాత్ర ప్రారంభించన విషయం తెలిసిందే. అయితే.. నేడు యాదాద్రి జిల్లా ముక్తాపూర్ వద్ద మీడియాతో బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతూ.. మూసినీటిని శుద్ధి చేస్తానని అన్న సీఎం మాట మరిచారని ఆరోపించారు. కాబట్టి మూసి నీటిని సీఎం కు పంపిస్తున్నామన్నారు బండి సంజయ్‌. వేలకోట్ల రూపాయలతో మూసి ప్రక్షాళన కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. నిధులు ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. 21న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారని, రాజగోపాల్ రెడ్డి మోడీ నాయకత్వంలో పనిచేస్తారని, పార్టీలో చేరుతారని అమిత్ షా నాకు ఫోన్ ద్వారా సమాచారం అందించారన్నారు.

దాసోజు శ్రవణ్ ను బీజేపీ పార్టీలో చేరాలని నేను ఆహ్వానిస్తున్నామన్నారు. జాతీయ భావాలు ఉన్న వ్యక్తి దాసోజు శ్రవణ్ అని ఆయన అన్నారు. తెలంగాణ చరిత్ర, సాంస్కృతి, ఉద్యమం పై అవహగన ఉన్న వ్యక్తి దాసోజు శ్రవణ్ అని ఆయన వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి క్రాంట్రాక్టర్, వ్యాపారస్తుడని, దుబ్బాకలో, హుజురాబాద్, డిపాజిట్ దక్కించుకోలేని కాంగ్రెస్ కు మునుగోడు లో కూడా అదే పరిస్థితి వస్తుందన్నారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.