NTV Telugu Site icon

Bandi Sanjay : కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి

Bandi Sanjay

Bandi Sanjay

కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పాంచ్ న్యాయ పేరుతో చెప్పింది ఎంటి… ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని, 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అంటున్నారు… వారితో రాజీనామా చేయిస్తే ఆ 26 సీట్లు బీజేపీ గెలుచుకుంటుందన్నారు బండి సంజయ్‌. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మధ్యే పోటీ అన్నారు. రెండు రాష్ట్రాలకు మంచి జరగాలని, కొందరు గోతి కాడి నక్కల్ల ఎదురు చూస్తున్నారు .. వారికి ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని. .. ఇద్దరు సీఎం లకు విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. దూకుడు ఆగదు. పదునైన రాజకీయ విమర్శలు యధావిధిగా చేస్తామన్నారు. పార్టీ ఫిరాయింపులను అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టారు.. కానీ అమలు చేయడం లేదన్నారు. బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో డెవలప్మెంట్ ప్రొసీడింగ్స్ ఇప్పిస్తున్నారని బండి సంజయ్‌ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మేము అలా చేస్తే పరిస్థితి ఎంటి ? అని ఆయన ప్రశ్నించారు.

అంతేకాకుండా..’నిరుద్యోగులకు ఉద్యోగులు ఇవ్వకుంటే కాంగ్రెస్ ఉద్యోగం పోవడం ఖాయం. రోజ్ గారి యోజన ద్వారా 10 లక్షల ఉద్యోగులు ఇచ్చారు ప్రధాని మోడీ. కాంగ్రెస్ పార్టీ 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అంటున్నారు.. దమ్ముంటే వారితో రాజీనామా చేసి గెలిపించుకోవాలి. ఈడి కి… బీజేపీకి సంబంధం లేదు. GHMC సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. కాంగ్రెస్ – BRS – MIM మూడు పార్టీలు ఒక్కటే. ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మహిళా కార్పొరేటర్ల ని చూడకుండా దాడి చేశారు. MIM ఎప్పుడు ఓల్డ్ సిటీ సమస్యల మీద మాట్లాడలేదు. ఓల్డ్ సిటీ సమస్యల పై కూడా బీజేపీయే మాట్లాడుతోంది. మోడీ నేతృత్వంలో దేశం భద్రంగా ఉంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటిని సమర్ధిస్తున్నాం. రెండు రాష్ట్రాల సిఎం లు చర్చించడంలో తప్పులేదు. రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని కోరుకుంటున్న. రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న చర్చల్లో మళ్ళీ వివాదాలు సృష్టించడానికి గోతి కాడ నక్కల్లగా ఎదురుచూస్తున్నారు…. ఎవరికి అవకాశం ఇవ్వవద్దు.’ అని బండి సంజయ్‌ అన్నారు.