NTV Telugu Site icon

Bandi Ramesh: కూకట్ పల్లిలో బండి రమేష్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వెయ్యి మంది యువత

Bandi Ramesh

Bandi Ramesh

కూకట్ పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లోని బీఆర్ఎస్- బీజేపీ పార్టీల నుండి 1000 మంది పైగా యువత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన యువ నేతలు అస్లాం, సంతోష్, సన్నీ, లా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి రమేష్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి బండి రమేష్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్- బీజేపీ పార్టీల మాయ మాటలు నమ్మేస్థితిలో యువత లేదని పేర్కొన్నారు.

Read Also: Uttar Pradesh: బెడ్రూం వీడియోలు బయటపెడతానని పోలీసుని బ్లాక్‌మెయిల్ చేసిన భార్య..

నేడు కాంగ్రెస్ పార్టీలో యువత చేరడం ఎంతో సంతోషంగా ఉందని వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు బండి రమేష్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎక్కడ చూసినా మంచి స్పందన కనిపిస్తుందని బండి రమేష్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మకి ఎన్నికల్లో ఓటు వేసి రుణం తీర్చుకోవాలని నియోజకవర్గ ప్రజలకి ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేసే ప్రభుత్వమని నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే కనిపిస్తున్నాయి.. తప్ప ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కనిపించడం లేదన్నారు.

Read Also: NBK 109: ఊటీ లో బాలయ్య మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్..

సీఎం కేసీఆర్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ ఎంత నాణ్యతతో అభివృద్ధి చేశారో స్పష్టంగా కనిపిస్తుందని బండి రమేష్ ఆరోపించారు. దాదాపు 70 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.. పట్టుమని ఐదు సంవత్సరాలు కూడా కాలేదు మీరు కట్టిన మేడిగడ్డ బ్యారేజీ కూలడానికి సిద్ధంగా ఉందన్నారు. ఎంత అభివృద్ధి చేశారో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు గోట్టుముక్కల వెంకటేశ్వరరావు, పుష్పారెడ్డి యాదగిరి అధ్యక్షులు మల్లికార్జున, NSUI అధ్యక్షులు అరుణ్, కిరణ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.