Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకుంటామని హైకోర్టులో బండి భగీరథ్ లాయర్ మెమో ఫైల్ చేశారు. భగీరథ్ అరెస్ట్‌కు ముందు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు తీర్పు ఇవాళ వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల భగీరథ్ అరెస్ట్‌తో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకోనున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బండి భగీరథ్‌పై పోక్సో కేసుతో పాటు అనేక సెక్షన్స్ యాడ్ చేశారు. తాజాగా మరో కొత్త సెక్షన్ జోడించినట్లు తెలిసింది. కీలక ఆధారాలు మాయం చేసినందుకుగాను తాజాగా 238 సెక్షన్‌ను అదనంగా జోడించారు పోలీసులు. భగీరథ్ డిజిటల్ ఆధారాలను తొలగించాడని, గతంలో వాడిన ఫోన్లు, సిమ్‌కార్డులు, ఇతర ముఖ్య ఆధారాలను నిందితుడు మాయం చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని కొత్త సెక్షన్ యాడ్ చేశారు.
ఇక తన కుమారుడి అంశంపై నిన్న(బుధవారం) మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. తనపై వస్తున్న ఆరోపణల అనంతరం తొలిసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న ఆయన మీడియాతో ప్రసంగించారు. “బీజేపీలో ప్రతిఒక్కరూ సుశిక్షితులైన కార్యకర్తలే ఉన్నారు. కమిట్మెంట్తో పనిచేసే పార్టీ కార్యకర్తను చివరి కోరిక ఏంటని అడిగితే.. చనిపోయిన తర్వాత బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటారు. నేను ఎలాంటి వాడినో కార్యకర్తలకు తెలుసు. నన్ను బర్తరఫ్ చేయాలని ఇతర పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ పార్టీకి లోక్‌సభలో ఒక్క ఎంపీ లేరు. ఫామ్‌హౌస్‌లో కూర్చుని ఏదైనా చెబుతారు. ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో కూల్చింది.. ఆ కుటుంబ పాలనను అంతం చేసింది మేమే. అందుకే మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ ఫేక్ సోషల్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నారు. కన్నకొడుకును పోలీసులకు స్వయంగా అప్పగించిన సందర్భం ఏదైనా ఉందా? విచారణకు సహకరించాలనే నా కుమారుడిని అప్పగించా.’’ అని బండి సంజయ్ అన్నారు.
Also Read
- Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
- Chandigarh University: ఫ్రెషర్స్ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
- AP Inter Exams 2027: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 2027 పరీక్షల ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ విడుదల
- Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
తాజావార్తలు
-
The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
-
Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
-
Chandigarh University: ఫ్రెషర్స్ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
Ram Charan: “మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న” చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
-
AP Inter Exams 2027: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 2027 పరీక్షల ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ విడుదల
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!