Site icon NTV Telugu

Bandaru Vijayalaxmi: రాంగోపాల్‌పేట డివిజన్‌లో పర్యటించిన బండారు విజయలక్ష్మి

Bandaru Vijayalaxmi

Bandaru Vijayalaxmi

Bandaru Vijayalaxmi: బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్‌పేట డివిజన్‌లో పర్యటించారు. రాంగోపాల్‌ పేట డివిజన్‌లోని బీజేపీ సీనియర్‌ నేతలను ఆమె కలిశారు. రాంగోపాల్‌పేట డివిజన్‌ కార్పొరేటర్‌ చీర సుచరిత శ్రీకాంత్‌ను కార్యాలయంలో కలిశారు. ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్‌లో జరిగే అభివృద్ధి పనుల గురించి, పార్టీ కార్యక్రమాల గురించి ఆరా తీశారు.

Also Read: Hima Varsha Reddy : శేషా రెడ్డి – నీరజా రెడ్డిల మాటే హిమ వర్షా రెడ్డి బాట

కార్పొరేటర్‌తో పాటు డివిజన్‌ జనరల్‌ సెక్రటరీ సందీప్ శర్మ, బీజేపీ సీనియర్ నాయకులు ఆనంద్‌ వ్యాస్, ఆకుల ప్రతాప్, సంగంశెట్టి మహేందర్ ఇళ్లను సందర్శించి వారి ఆరోగ్యం, యోగక్షేమాలు, పార్టీ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. సికింద్రాబాద్‌ లేదా ముషీరాబాద్‌ నుంచి ఆమె ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆదివారం ప్రజా యుద్ధనౌక గద్దర్ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఎల్బీ స్టేడియంలో ఆయన పార్థివదేహానికి బండారు విజయలక్ష్మి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమానికి గద్దర్ పాటలు ప్రాణం పోశాయని ఆమె తెలిపారు. విప్లవకారుడైన గద్దర్ మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రజా ఉద్యమానికి ప్రాణం పోసిన గద్దర్ ఆట, పాటను మనం మిస్ అవుతున్నామని బండారు విజయలక్ష్మి పేర్కొన్నారు.

Exit mobile version