NTV Telugu Site icon

BC Janardhan Reddy: బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగరడం ఖాయం..!

Bc Janardhan Reddy

Bc Janardhan Reddy

BC Janardhan Reddy: బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్‌రెడ్డి.. నంద్యాల జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకోగా.. బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి.. గెలుపే దిశగా మరో ముందడుగు వేశారు.. ఈ రోజు కుటుంబసభ్యుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని చిత్తుగా ఓడిస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఈసారి అరుంధతి కోటపై అభివృద్ధి సాధకుడు బీసీ జనార్థన్ రెడ్డి టీడీపీ జెండా ఎగరవేయబోతున్నారా. ? వార్ వన్‌సైడ్‌గా మారబోతుందా..? అంటున్నాయి టీడీపీ శ్రేణులు.

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో.. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నామినేషన్ల పర్వానికి తెరలేచింది. ఈ రోజు.. ఏప్రిల్ 20, శనివారం ఉదయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ జనార్థన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా సతీమణి శ్రీమతి బీసీ ఇందిర రెడ్డితో కలిసి స్థానిక దర్గా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీసీ జనార్థన్ రెడ్డి.. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి తన తల్లిదండ్రులు స్వర్గీయ బీసీ గుర్రెడ్డి, లక్ష్మమ్మల చిత్రపటాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ వెంటన గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆర్వో కార్యాలయానికి చేరుకుని, రిట్నరింగ్ అధికారి సమక్షంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జనార్థన్ రెడ్డి సతీమణి శ్రీమతి బీసీ ఇందిర రెడ్డి, కుమారుడు బీసీ మనోహర్ రెడ్డి, కుమార్తులు మనోరమ రెడ్డి, మహాలక్ష్మీ, అల్లుడు రమణ రెడ్డి, పుస్కిన్ రెడ్డితో పాటు, బీసీ జనార్థన్ రెడ్డి సోదరులు బీసీ రాజారెడ్డి, బీసీ రామనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇక, నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బీసీ జనార్ధన్‌రెడ్డి.. బనగానపల్లె నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తల ఆశీర్వాదంతో నామినేషన్ వేసినట్లు తెలిపారు. ఈ 5 ఏళ్లలో వైపీపీ ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, మైనారిటీలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.. ఈ అసమర్థ, అవినీతి, అరాచక ప్రభుత్వంపై ప్రజలు తిరగ బడుతున్నారు.. ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమని బీసీ జనార్థన్ రెడ్డి జోస్యం చెప్పారు. మళ్లీ రాష్ట్రం గాడిన పడాలంటే.. అనుభవం కలిగిన చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కచ్చితంగా బనగానపల్లెలో కూడా టీడీపీని గెలిపించడం ఖాయమని బీసీ జనార్థన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బనగానపల్లె నియోజకవర్గాన్ని మళ్లీ అభివృద్ధిపథంలో పయనింపజేసేందుకు. బనగానపల్లె ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా నామినేషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి.