Bangladesh Set 335 Target to Afghanistan in Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భాగంగా లాహోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్ మెహిది హసన్ మీరజ్ (112; 119 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టార్ బ్యాటర్ నజ్ముల్ హసన్ షాంటో (104; 105 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. ఆఫ్ఘన్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు మొహమ్మద్ నైమ్ (28), మెహిది హసన్ మీరజ్ 60 పరుగుల భాగస్వామ్యం అందించారు. నైమ్ ఔట్ అనంతరం క్రీజులోకి వచ్చిన తౌహిద్ హ్రిదోయ్ డకౌటయ్యాడు. ఈ సమయంలో మీరజ్, నజ్ముల్ హసన్ షాంటో ఆఫ్ఘన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ పరుగులు చేశారు. ఈ క్రమంలోనే సెంచరీలు చేశారు.112 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మీరజ్ రిటైర్డ్ హర్ట్ కాగా.. 104 పరుగులు చేసి షాంటో రనౌటయ్యాడు. ముష్ఫికర్ రహీం (25), షకీబ్ అల్ హసన్ (32 నాటౌట్) రాణించారు.
Also Read: iPhone 13 Price Drop: ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఎన్నడూ లేనంత తక్కువ ధరకే!
ఆసియా కప్ 2023 రేసులో ఉండాలంటే బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. ఎందుకంటే బంగ్లా తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ గెలిస్తే.. శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో సంబంధం లేకుండా సూపర్-4కు చేరుకుంటుంది. ఇక తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచిన శ్రీలంక సూపర్-4 బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. గ్రూప్-ఏ నుంచి పాకిస్తాన్ ఇప్పటికే సూపర్-4కు అర్హత సాధించింది. నేపాల్, భారత్ మ్యాచ్‌తో మరో జట్టు గ్రూప్-ఏ నుంచి సూపర్-4కు అర్హత సాధిస్తుంది.