Site icon NTV Telugu

Balti: కబడ్డీ నేపథ్యంలో రానున్న బల్టీ.. అప్పటి నుంచే థియేటర్లలో

Balti

Balti

Balti: షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్ తో పాటు ప్రేమమ్ డైరెక్టర్ ఆల్పాన్స్ పుదిరన్ ప్రధాన తారాగణంగా ఉన్ని శివలింగం దర్శకత్వంలో తమిళ, మలయాళ భాషల్లో ఘన విజయం సాధించిన ‘బల్టీ’ చిత్రం తెలుగులో అక్టోబర్ 10న విడుదలవుతోంది. కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రాజకీయాలు, గ్యాంగ్ స్టర్ కథలతో కలిపి వైవిధ్యంగా రూపొందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎల్మా పిక్చర్స్ సంస్థ విడుదల చేస్తోంది.

మరో బిగ్ సేల్ కు శ్రీకారం చుట్టిన Flipkart.. అక్టోబర్ 11 నుండి Big Bang Diwali Sale 2025 షురూ..

ఈ సందర్భంగా సంస్థ అధినేత ఎన్. ఎథిల్ రాజ్ మాట్లాడుతూ.. తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా అక్కడ ఘనవిజయం సాధించింది. క్రిటిక్స్ కూడా చక్కటి రివ్యూలు ఇవ్వడంతో ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయడం జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ సంగీతాన్ని అందించారని అన్నారు. మలయాళంలో RDX సినిమాతో గత సంవత్సరం ఘన విజయాన్ని సొంతం చేసుకొని మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు షేన్ నిగమ్ ఇందులో హీరోగా అద్భుతమైన నటన కనబరిచారని తెలిపారు. ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్ కీలక పాత్రలలో నటించారని.. అలాగే ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించారని ఆయన తెలిపారు.

Everest Snowstorm: ఎవరెస్ట్‌పై మంచు తుపాను.. ప్రమాదంలో 1000 మంది ప్రాణాలు..

ఇక సినిమా దర్శకుడు ఉన్ని శివలింగం మాట్లాడుతూ.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న వెలంపాళయంలో జ‌రిగే ఔట్ అండ్ ఔట్ రా ర‌స్టిక్ విలేజ్ డ్రామాగా సినిమా వుంటుందని ఆయన అన్నారు. ఆ ఊరిని శాసించే ముగ్గురు పెద్ద‌లు వారి మ‌ధ్య జ‌రిగే వ్యాపార, రాజ‌కీయాల్లో న‌లుగురు క‌బ‌డ్డీ ప్లేయ‌ర్స్ చిక్కుకోవ‌డం.. ఆపై వ‌చ్చే ఘ‌ర్ష‌ణ‌లు, భావోద్వేగాల స‌మాహారంగా బ‌ల్టీ (Balti) సినిమా వుంటుంది అని అన్నారు.

Exit mobile version