Site icon NTV Telugu

Balochistan: బలూచిస్తాన్‌లో బలవంతంగా అదృశ్యం అవుతున్న బలూచ్‌లు.. పాకిస్తాన్ సైన్యంపై తీవ్ర ఆరోపణలు

Balooch

Balooch

బలూచిస్తాన్‌లో బలవంతంగా బలూచ్‌లు అదృశ్యం కావడం పెరుగుతున్న ధోరణిపై మానవ హక్కుల సంస్థలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విమర్శించాయి. దీనిని మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా అభివర్ణించాయి. బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్ సైన్యం మరో ఏడుగురు బలూచ్‌లను బలవంతంగా అదృశ్యం చేసిందని బలూచ్ జాతీయ ఉద్యమ మానవ హక్కుల విభాగం తెలిపింది. బాధితులను తరచుగా ఎటువంటి చట్టపరమైన ప్రక్రియ లేకుండానే తీసుకెళ్తారు. వారి గురించి వారి బంధువులకు ఎటువంటి సమాచారం ఇవ్వరు. మస్తుంగ్‌లోని కిల్లి షేఖాన్ ప్రాంతం నుంచి వకాస్ బలోచ్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

Also Read:Bhuma Akhila Priya: ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మంచి మనసు.. ఐదు నెలల జీతం విరాళం!

మే 18న, గ్వాదర్ నుంచి నవీద్ బలోచ్, మస్తుంగ్ నుండి అట్టా ఉల్లా బలోచ్‌లను అరెస్టు చేశారు. అంతకుముందు మే 16న, పాకిస్తాన్ అధికారులు షా నవాజ్ బలోచ్‌ను అతని తండ్రితో పాటు సైనిక శిబిరానికి పిలిపించారు. తండ్రిని వెనక్కి పంపించారు, కానీ నవాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి అతను కనిపించకుండా పోయాడు. మే 17న జరిగిన మరో సంఘటనలో, నసీరాబాద్ నివాసి అమీన్ ఉల్లా బలోచ్‌ను భద్రతా దళాలు అపహరించాయి. అదే రోజు నసీరాబాద్ నుంచి తప్పిపోయిన 13 ఏళ్ల ఫయాజ్ అలీ ఎక్కడా కనిపించలేదు.

Also Read:Warning Signs of Heart Attack : గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే..

బలవంతపు అదృశ్యాలకు వ్యతిరేకంగా మార్చ్ నిర్వహించారు. భూసేకరణ, బలవంతపు అదృశ్యాలకు వ్యతిరేకంగా సింధియా నేషనల్ కాంగ్రెస్ మార్చ్ నిర్వహించింది. కరాచీ, లర్కానా, బాడిన్, సుక్కూర్, ఖైర్‌పూర్, నవాబ్‌షా, దాదు, ఉమర్‌కోట్, థార్‌పార్కర్ మొదలైన సింధ్ ప్రాంతాల నుండి వేలాది మంది ప్రజలు గుమిగూడారు. రైతులు, న్యాయవాదులు, రాజకీయ కార్యకర్తలు, మహిళలు, పిల్లలు సంఘీభావంగా కవాతులో పాల్గొన్నారు.

Exit mobile version