Site icon NTV Telugu

Ball Tampering: ఓవల్ టెస్ట్ లో భారత్ మోసం చేసింది.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

Ball Tampering

Ball Tampering

Ball Tampering: ఇంగ్లాండ్‌తో జరిగిన ఓవల్ టెస్ట్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో విజయాన్ని సాధించింది. ఐదవ, చివరి టెస్ట్ మ్యాచ్ చివరి రోజున భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కలిసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను చిత్తుచేశారు. అయితే, ఈ టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

Google AI Pro: ఫ్రీ.. ఫ్రీ.. విద్యార్థులకు శుభవార్త.. ఏడాదిపాటు గూగుల్ AI ప్రో ప్లాన్ ఉచితం.. కాకపోతే!

పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ తన ట్వీట్ లో.. నా అభిప్రాయం ప్రకారం భారత్ వాజిలిన్‌ను ఉపయోగించింది.. దానితో బంతి 80+ ఓవర్ల తర్వాత కూడా కొత్తగా మెరుస్తుంది. అంపైర్ ఈ బంతిని పరీక్ష కోసం ప్రయోగశాలకు పంపాలని రాసుకొచ్చాడు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ పోస్ట్ లో షబ్బీర్ అహ్మద్ ఖాన్ ను ఎక్కి పారేస్తున్నారు. ఇందులో కొందరైతే.. మీ వక్ర బుద్ధి మళ్లీ బయట పెట్టారంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.

Exclusive : ‘0’ ఫ్లాప్స్ డైరెక్టర్లు – కానీ రిస్క్ 100%.. ఎందుకంటే?

ఇకపోతే, టెస్ట్ చివరి రోజున విజయం కోసం ఇంగ్లాండ్‌కి 35 పరుగులు అవసరం కాగా, భారత్‌కి 4 వికెట్లు కావాల్సివుంది. అయితే మహ్మద్ సిరాజ్ మ్యాజిక్ స్పెల్‌తో ఇంగ్లాండ్‌ను కుదేలు చేశాడు. అతడు ఆ రోజు 3 వికెట్లు తీసుకోగా, ప్రసిద్ధ్ కృష్ణ మరో కీలక వికెట్ తీశాడు. మొత్తం ఈ టెస్ట్‌లో మహ్మద్ సిరాజ్ 9 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 8 వికెట్లు, ఆకాశ్ దీప్ 2 వికెట్లు సాధించారు. ఈ టెస్ట్ సిరీస్‌లో మహ్మద్ సిరాజ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. మొత్తం 5 టెస్ట్‌ల్లో 23 వికెట్లు తీసి, తన కెరీర్‌లో తొలిసారి టెస్ట్ సిరీస్‌లో టాప్ వికెట్ టేకర్ అయ్యాడు. 5వ టెస్ట్‌లో అందించిన అద్భుత ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.

Exit mobile version