Site icon NTV Telugu

సన్నాసి బండి సంజయ్ కు ఏం తెలీదు : బాల్క సుమన్

బండి సంజయ్‌ పై బాల్క సుమన్ ఫైర్‌ అయ్యారు. బిజెపికి బండి సంజయ్ గుదిబండల తయారు అయ్యారని… బండి సంజయ్ పాదయాత్ర కు స్పందన లేదని ఎద్దవా చేశారు. బురదలో పొర్లే పందికి పన్నీర్ వాసన తెలియనట్లే … బండి సంజయ్ కి ప్రగతి భవన్ గురించి తెలియదన్నారు. ప్రగతి భవన్ సబ్బండ వర్గాల సంక్షేమ భవన్ అని…నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిమానం కేసీఆర్ కు వెలకట్టలేని ఆస్తి అని స్పష్టం చేశారు.

ఇది సన్నాసి బండి సంజయ్ కు తెలియదని చురకలు అంటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సక్కగా ఉందని బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు. వినాయక నిమజ్జనం ముగిసింది… ఇక ప్రతిపక్షాల నిమజ్జనం మిగిలి ఉందని….ఆ బాధ్యత ప్రజలు తీసుకుంటారన్నారు. సదువు రాని సన్నాసి బండి సంజయ్ కు ఏమి చెప్పినా అర్థం కాదని ఎద్దేవా చేశారు. మోడీ అప్పులు చేస్తూ రికార్డు సృష్టిస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

Exit mobile version