NTV Telugu Site icon

Balineni Srinivasa Reddy: రాజకీయాల్లో ఉన్నంత వరకూ సీఎం జగన్‌తోనే.. టీడీపీతో టచ్‌లో లేను..!

Balineni

Balineni

Balineni Srinivasa Reddy: ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది.. కొందరు నేతలపై రకరకాలుగా ప్రచారం సాగుతోంది.. పార్టీ అధినేతలకు దగ్గరగా ఉండేవారు సైతం.. పక్కచూపులు చూస్తున్నారు.. పార్టీ వీడతారనే ప్రచారం సోషల్‌ మీడియాలో జరుగుతోంది.. అలాంటి ప్రచారమే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డిపై కూడా సాగుతూ వస్తోంది.. అయితే, వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచే.. అదికూడా ఒంగోలు నుంచే పోటీచేస్తానని స్పష్టం చేశారు బాలినేని.. విలువతోనే రాజకీయాలు చేస్తున్నా.. విలువల కోసమే మంత్రి పదవిని వదులకుని.. సీఎం వైఎస్‌ జగన్‌ వెంట నడిచానని తెలిపారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఎమ్మెల్యే స్ధానాల మార్పు జరుగుతోందన్నారు.

Read Also: Alaska Airlines: టేకాఫ్ అయిన వెంటనే విరిగిన విమానం డోర్.. తర్వాత ఏమైందంటే..?

ఇక, తాను గిద్దలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నానన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు బాలినేని.. అంతేకాదు.. పార్టీ మారుతున్నానన్న ప్రచారంలో కూడా వాస్తవం లేదన్నారు.. తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్ లో ఉన్నానన్నది అవాస్తవమని తేల్చేశారు. రాజకీయాల్లో ఉన్నంత వరకూ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరూ పార్టీకి, సీఎం జగన్ కు అండగా ఉండాల్సిన సమయం అన్నారు. ఎంపీ మాగుంట విషయాన్ని కూడా సీఎం జగన్ తో మాట్లాడుతానని తెలిపారు. ఇక, సీట్లు, పోటీపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయమే శిరోధార్యం క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.