Site icon NTV Telugu

Balineni Srinivasa Reddy: అన్నీ ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్..

Balineni

Balineni

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. గతరాత్రి సుదీర్ఘంగా ఆయన్ను విచారించిన అధికారులు.. రిమాండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. 2021లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు.. కాగా, కొద్దిసేపటి క్రితమే ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరను చేర్చి రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు.

Read Also: Surya Stotram: రోగ నివారణకు ఈ స్తోత్ర పారాయణం భక్తిశ్రద్ధలతో చేయండి

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అన్నీ ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ చేశారని ఆయన వ్యాఖ్యనించారు. కోర్టు ఏ నిర్ణయంతో.. వాస్తవాలు తెలుస్తాయి.. చంద్రబాబును జైలుకు పంపించాలని టార్గెట్ చేసుంటే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తారు.. చంద్రబాబును అరెస్టు చేయటానికి ఐదేళ్లు ఎదురు చూస్తారా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Read Also: Car Loan: ప్రభుత్వ బ్యాంకుల్లో కారు రుణాలు చౌక.. రూ. 5 లక్షల లోన్ పై ఎంత ఈఎంఐ అంటే?

కేసు క్లియర్ కట్ గా ఉంది.. చంద్రబాబు అరెస్ట్ తో పవన్ కళ్యాణ్ తో పొత్తు ఉంటుందని అర్థమవుతుంది అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి అవినీతికి తావులేకుండా సీఎం జగన్ చూస్తున్నారని మాజీ మంత్రి అన్నారు. చంద్రబాబు చేసిన తప్పులే ఆయనను జైలుకు పోతాడని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చంద్రబాబు చూసింది ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. ముందు సినిమా చాలా ఉందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Exit mobile version