రాజకీయాల్లో మొదటి నుంచి విలువలతో కూడిన రాజకీయాలు చేశానన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. 1987 నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయాల్లో ఉన్నా..మొదటి నుంచి విలువలతో కూడిన రాజకీయాలు చేశా..1999 వైఎస్ఆర్ రాజకీయ బిక్షతో ఎమ్మెల్యే అయ్యా..2009లో వైఎస్ఆర్ క్యాబినెట్ లో మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు..వైఎస్ఆర్ మరణం తర్వాత మంత్రి పదవి పోతుందని తెలిసి కూడా జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్నా అన్నారు. మంత్రి పదవి, ఎమ్మెల్యే వదులుకుని వైసీపీలోకి వచ్చి పోటీ చేసి గెలిచానన్నారు.
Read Also: IMD Weather Alert: మోచా తుఫాన్ తీవ్రతపై యంత్రాంగం అప్రమత్తం
జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు..ఈ మధ్య కాలంలో చెన్నై హవాలా అంటారు..ఎవరెవరో ఏదేదో నాపై మాట్లాడుతున్నారు..గోనె ప్రకాశరావు ఆరోపణల్లో అర్థం లేదు..వైవీ సుబ్బారెడ్డి మంచివాడు.. నేను చెడ్డవాన్ని అంటాడు..సీఎం జగన్, భారతమ్మ జైలుకి వెళ్లటం ఖాయం అంటారు.. వైవీ సుబ్బారెడ్డి మంచివాడు అంటారు..తెలంగాణకు సంబందించిన ఆయనకు ఇక్కడి రాజకీయాలతో ఏం పని..నాపై ఎమ్మెల్యేలతో సీఎంకి ఫిర్యాదులు చేయిస్తారు..మంచి చేయటానికి రాజకీయాల్లోకి వచ్చా తప్ప దోచుకోవటానికి కాదు..భరింలేనంతగా నాపై ఆరోపణలు చేస్తున్నారు..
నా మీద కాకపోతే, నా కొడుకు మీద ఆరోపణలు చేస్తున్నారు..ఏ ఒక్క ఆరోపణ అయినా నిరూపించ గలరా..మాట్లాడితే పార్టీ మారుతున్నాయని సొంత పార్టీ నేతలు మాట్లాడటం బాధాకరం..సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించడం కోసమే మూడు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ భాద్యతలు వద్దని చెప్పా..నా తప్పులు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..వైసీపీ కార్యకర్తల కోసం ఎంత త్యాగానికైనా సిద్దం..నా మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారు అంటూ మండిపడ్డారు బాలినేని.
Read Also: Suryanarayana: 10వేల కోట్లు దారిమళ్ళింపు రాజ్యాంగ ఉల్లంఘనే