NTV Telugu Site icon

Akhanda 2: మహా కుంభమేళాలో బాలయ్య మూవీ షూట్..ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటే ?

Akhanda2

Akhanda2

Akhanda 2: వరుస హిట్లు కొడుతూ మంచి జోరు మీద ఉన్నారు బాలకృష్ణ. తాజాగా డాకూ మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీసు దుమ్ము దులుపుతోంది. రూ.100కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాలయ్య స్టామినా ఏంటో చూపిస్తోంది. ఈ సినిమా తర్వాత తనకు హ్యాట్రిక్ హిట్స్ అందించిన బోయపాటితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2ను తెరకెక్కి్స్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆత్యాధ్మిక వేడుక అయిన ‘మహా కుంభమేళా’ ప్రస్తుతం భారత్‌లోని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో జరుగుతోంది. ఈ వేడుకలో కోట్లాది భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు తరలి వస్తున్నారు. ఒక్కరోజులోనే ఏకంగా 3.5 కోట్ల మంది ఈ పుణ్యస్నానాలు చేశారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టి ఈ వేడుకకు ఎలాంటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇలాంటి వేడుకను సినిమా వారు కూడా తమ సినిమాలో చూపించేందుకు ఆసక్తిని చూపుతున్నారు మేకర్స్.

Read Also:Road Accident: చిత్తూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి, 13 మందికి గాయాలు!

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ ‘అఖండ 2 – తాండవం’. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలై కొనసాగుతోంది. ఈ సినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఈ సినిమాలో అఘోరా పాత్రలో నటిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మహా కుంభమేళాలో జరుగుతోంది. ఈ మహా కుంభమేళా కి సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ మహా కుంభమేళాలో బాలయ్య కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. మహా కుంభమేళాలో అఘోరా పాత్ర కూడా కనిపిస్తుందని.. దీని కోసం బాలకృష్ణకు సంబంధించిన కొన్ని షాట్స్ చిత్రీకరించాలని.. అయితే, జనం తాకిడి తక్కువగా ఉన్న సమయంలో బాలయ్యపై ఈ సీన్స్ చిత్రీకరించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి మహా కుంభమేళా లో బాలయ్య ఎప్పుడు పాల్గొంటాడనేది ఆసక్తికరంగా మారింది.

Read Also:Realme 14 Pro Series: ప్రపంచంలో మొట్టమొదటి రంగులు మారే ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్స్ ఇవే