బాలయ్య సినిమాలు అంటే పిచ్చెక్కించే మాస్ అంశాలతో పాటు ఆయన సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోతాయి. ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచే తన సినిమాలకి మంచి మ్యూజిక్ అందించే మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకున్నారు.ఇక సాంగ్స్ తో పాటు బాలయ్య మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు దానికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండాలి అందుకే మ్యూజిక్ డైరెక్టర్ సంగతి లో బాలయ్య ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాడు.టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న డైరెక్టర్-మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ లు చాలానే ఉన్నాయి.పలువురు దర్శకులు హిట్ సెంటిమెంట్ ని కొనసాగిస్తూ వరుసగా ఒకే సంగీత దర్శకుడితో ఎక్కువ సినిమాలు అయితే చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ ని హీరోలు కూడా ఫాలో అవుతున్నారని తెలుస్తుంది.. నటసింహ నందమూరి బాలకృష్ణ, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ కి వరుస అవకాశాలు ఇస్తుండటం ఆసక్తికరంగా అయితే మారింది.
ప్రస్తుతం బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే.. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’తో వరుస విజయాలు అందుకున్న బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న ‘NBK 108’తో హ్యాట్రిక్ కొట్టెందుకు చూస్తున్నాడు.. అయితే బాలయ్య లేటెస్ట్ సక్సెస్ జర్నీలో థమన్ కూడా భాగమయ్యాడు. బాలయ్య-థమన్ మొదటిసారి 2016 లో విడుదలైన ‘డిక్టేటర్’ కోసం పని చేసారు.. ‘అఖండ’తో వీరిది సక్సెస్ ఫుల్ కాంబోగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. ఆ తర్వాత వచ్చిన ‘వీరసింహారెడ్డి’తోనూ అదే మ్యాజిక్ ను రిపీట్ చేశారు. ఇక ఇప్పుడు బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరీ సినిమాకి కూడా థమనే సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.. దీని తర్వాత బాలయ్య చేయనున్న మరో సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా థమన్ వ్యవహరించనున్నాడని తెలుస్తుంది.బాలయ్య తన 109 వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేయనున్నాడని సమాచారం.. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్ర అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా థమన్ పని చేయనున్నాడని తెలుస్తుంది.. అంతేకాదు బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో రానున్న కొత్త చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తాడని సమాచారం.. ఈ విధంగా బాలయ్య కొత్త సినిమా వస్తుందంటే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అని అనుకోవాల్సిందే.
