Balapur Ganesh Laddu Auction: అందరూ ఎదురు చూస్తున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ముగిసింది. బాలాపూర్ గణేష్ చివరి పూజా కార్యక్రమం అనంతరం క్రేన్ సహాయంతో బాలాపూర్ గణేషుడ్ని మినీ ట్రక్కుపైకి ఎక్కించి గ్రామ ప్రదక్షిణ నిర్వహించారు. బాలాపూర్ గ్రామ బొడ్రాయి దగ్గరకు గణేష్ విగ్రహాన్ని తీసుకవచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట కార్యక్రమం ప్రారంభమైంది.
గత ఏడాది రూ. 35 లక్షలు పలికిన లడ్డు ధర.. ఈసారి కమిటీ పాట రూ. 1,116లతో మొదలై గత ఏడాది కంటే 4 లక్షల రూపాయలు అధికంగా అమ్ముడైంది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డును రూ. 39 లక్షలతో వేలంలో సామ ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు.

