NTV Telugu Site icon

Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?

Daakumaharaajevent

Daakumaharaajevent

ఈ సంక్రాంతి రేసులో ‘డాకు మహారాజ్’ మూవీతో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్న విషయం తెలిసిందే. బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది. బాలయ్యతో సినిమా అంటే దర్శకులకు పెద్ద ఛాలేంజ్ అని చెప్పాలి. ఎందుకంటే.. ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ బాలయ్య నుంచి ఎలాంటి కథలు అయితే కోరుకుంటున్నారో అవన్నీ ఉండేలా దర్శకులు చూసుకోవాలి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు బాబీ ఈ ‘డాకు మహారాజ్’ మూవీని కూడా ఎంతో జాగ్రతగా తెరకెక్కించినట్లు తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ చూస్తే చెప్పోచ్చు.

తాజాగా వచ్చిన డాకు మహారాజ్ ట్రైలర్ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెంచింది. హ్యాట్రిక్స్ హిట్ కొట్టి జోరు మీదున్న బాలయ్య ఖాతాలో మరో హిట్ కూడా పడడం పక్కా అని తెలుస్తోంది. అంతే కాదు ఒక్క షాట్‌కి కూడా బాలకృష్ణ డూప్‌ని వాడలేదంటూ దర్శకుడు బాబీ చెప్పిన మాటలు అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని పెంచేస్తున్నాయి. ఇక జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ మూవీపై రూ.70 కోట్లకి పైగా థీయాట్రికల్ బిజినెస్ జరిగింది.

Also Read: Free Replacement Policy: ‘వన్‌ప్లస్‌’ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. పాడైతే ఉచితంగా కొత్త ఫోన్!

ఇదిలా ఉంటే.. తాజాగా ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ మూవీ టీం ఫిక్స్ చేశారు. జనవరి 9న సాయంత్రం 5 గంటలకు అనంతపురంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కి ఏపీ మంత్రి, బాలయ్య బాబు అల్లుడు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మామ, అల్లుళ్లు స్టేజిపై ఎంతటి రచ్చ చేస్తారో చూడాలి. ఈ ఈవెంట్ కోసం బాలయ్య ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show comments