Site icon NTV Telugu

Balakrishna : రాష్ట్రంలో ఒక్కొక్క శాఖలో అవినీతి బయట పడుతోంది

Balakrishna

Balakrishna

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం రూరల్ పరిధిలోని కొటిపిలో అర్ధాంతరంగా నిలిచిపోయిన టిడ్కో గృహాలను ఎమ్మెల్యే బాలకృష్ణ పరిశీలించారు. కొటిపిలో రూ.4 కోట్ల విలువతో  నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి బాలకృష్ణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్కొక్క శాఖలో అవినీతి బయట పడుతోందన్నారు. మున్ముందు శాఖలో జరిగిన అక్రమాలు అన్ని బయటకు వస్తాయని, వ్తెసీపీలో వ్యవస్థలన్నింటిని నాశనం చేశారన్నారు బాలకృష్ణ. ఇసుక , మద్యం , మ్తెనింగ్ లలో అక్రమాల చేసి కమీషన్లకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. పరిపాలన చేయడం చేతకాక …మూడు రాజధానులు , నవరాత్నల పేరుతో మోసం చేశారని, టీడీపీ హాయంలో లేటేస్ట్ టెక్నాలజీ టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు.

 

వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో నిర్మాణాలు ఆగిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మించి ఇవ్వాలనేదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, టిట్కో గృహాలల్లో ఉన్న సామాగ్రిని నాశనం చేసి పెట్టారని బాలకృష్ణ మండిపడ్డారు. ఆరు నెలల్లో వాటిని పూర్తి చేసి ప్రతి నిరుపేదకు అందిస్తామని, గతంలో హిందూపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది మా నాన్న స్వర్గీయ ఎన్టీ రామారావు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి ప్తె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించానని ఆయన వ్యాఖ్యానించారు.

 

Exit mobile version