Site icon NTV Telugu

Balakrishna : ఏషియన్ తారకరామా థియేటర్ ప్రారంభించిన బాలయ్య

Balakrishna Tarakarama Cine Complex Theater Re Open

Balakrishna Tarakarama Cine Complex Theater Re Open

Balakrishna : నందమూరి ఫ్యామిలీ కి చెందిన తారకరామా సినిమా థియేటర్ కొన్నాళ్లుగా పని చేయకుండా ఉంది. దానిని నేడు బాలకృష్ణ కాసేపటి క్రితమే ప్రారంభించారు. దీనిని తారకరామా సినీప్లెక్స్ ను ఏషియన్ వారు తీసుకుని పునః నిర్మించారు. దాంతో ఇప్పుడు పెద్ద ఎత్తున ఆదరణ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవతార్ సినిమా తో నందమూరి వారి కొత్త థియేటర్ అందుబాటులోకి రాబోతుంది. అద్భుతమైన విజువల్ వండర్ ను తారకరామా సినీప్లెక్స్ లో చూసేందుకు స్థానిక ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. సంక్రాంతి కి ఈ థియేటర్లో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ప్రదర్శించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Read Also: Australia: అత్త సొమ్ము.. అల్లుడి దానమంటే ఇదేనేమో.. చివరికి జైలుపాలయ్యాడు

థియేటర్ విశేషాలకొస్తే.. ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవంతో లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ నారాయణ్ కె.దాస్ పదేళ్ల క్రితం కాచిగూడలోని తారకరామ థియేటర్‌ని పునరుద్ధరించారు. ఎన్టీఆర్, నారాయణ్ కె.దాస్ నారంగ్ ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. ఆసియన్ తారకరామ సినిమా హాల్‌ను నారాయణ్ కె.దాస్ నారంగ్ కుమారుడు సునీల్ నారంగ్ పునః నిర్మించారు. ఈ థియేటర్‌లో ఇప్పుడు పూర్తిగా కొత్త టెక్నాలజీ అయిన 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండింగ్, సీటింగ్ ఉన్నాయి. 975 సీట్ల కెపాసిటీ ఉన్న హాల్‌ని 590 సీట్లకు తగ్గించి సినిమా చూసే అనుభూతిని మెరుగుపరచనున్నారు. హాల్‌లో పూర్తి రెక్లైనర్ సీట్లు, సోఫాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంటీరియర్ వర్క్ కూడా అద్బుతంగా ఉండనుంది. నందమూరి బాలకృష్ణ ఏషియన్ తారకరామను రీ-ఓపెన్ చేశారు. ఈ నెల 16 నుంచి అవతార్ 2 చిత్రంతో ఏషియన్ తారకరామలో ప్రదర్శనలు కొనసాగుతాయి.

Exit mobile version