వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ. యువత దేశ భవిత.. వారి అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. శ్రీ సత్య సాయి జిల్లాలో బాలయ్య మీడియాతో మాట్లాడారు. లోకేష్ పాదయాత్ర పై బాలకృష్ణ స్పందించారు. లోకేష్ పాదయాత్రలో రేపు పాల్గొంటున్నాను. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు పరిశ్రమలు తరలిపోతున్నాయి. లోకేష్ పాదయాత్ర కు అన్ని అడ్డంకులు,ఆంక్షలు ఉంటాయి. జనం తిరగబడితే ఏం జరుగుతుందో గతంలో చూశాం… యువ గళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్రను ప్రజలందరూ ఆశీర్వదించాలన్నారు.
Read Also: Balakrishna Response on SVR Issue Live: ఎస్వీ రంగారావు వివాదంపై బాలయ్య స్పందన
యువత దేశ భవిత.. వారి అభివృద్ధి కోసం పాటుపడాలి. అక్కినేని తొక్కనేని మాటలపై స్పందించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటివారు నాన్నగారు, అక్కినేని నాగేశ్వరరావు. నాన్నగారు నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం అన్న విషయాన్ని నేర్చుకున్నాను. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు. నాగేశ్వరరావు గారు తన పిల్లలకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారు. నాన్న పరమపదించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించడం జరిగింది. బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుంది. బయట ఏం జరిగినా నేను పట్టించుకోను అన్నారు బాలకృష్ణ.
Read Also: Allowance for Unemployed: నిరుద్యోగ యువతకు శుభవార్త.. భృతిని ప్రకటించిన సీఎం