Site icon NTV Telugu

Nayanthara: బాలయ్య ‘NBK 111’ నుంచి నయనతార అవుట్? రెమ్యునరేషన్ వల్లేనా?

Nbk 111

Nbk 111

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK 111’. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో, ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన షేడ్స్‌లో కనిపించనున్నారని, అందులో ఒకటి మహారాజు పాత్ర కాగా, మరొకటి ముంబై గ్యాంగ్‌స్టర్ లుక్ అని టాక్.

ఇప్పటికే ఒక భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన గోపీచంద్ మలినేని, ఈసారి బాలయ్యను మరింత పవర్‌ఫుల్ మాస్ లుక్‌లో చూపించేందుకు సిద్ధమవుతున్నారు. సముద్రఖని ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తారని మొదట ప్రచారం జరిగింది.. కానీ ఇంతలోనే ఇప్పుడు ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. కాగా నయన తప్పుకొడం గురించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది.

నయనతార దాదాపు రూ. 10 కోట్ల భారీ పారితోషికం డిమాండ్ చేయడం, షూటింగ్ కాల్షీట్ల సర్దుబాటు, ప్రమోషన్లకు దూరంగా ఉండే నిబంధనల వల్ల మేకర్స్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. అదే సమయంలో, ‘భగవంత్ కేసరి’తో బాలయ్యకు లక్కీ చార్మ్‌గా మారిన కాజల్.. తక్కువ పారితోషికంతో పాటు ప్రచార కార్యక్రమాలకు కూడా అందుబాటులో ఉంటానని హామీ ఇవ్వడంతో టీమ్ ఆమెను ఫైనలైజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నయనతార మరోసారి బాలయ్యతో కలిసి నటించే క్రేజీ ఛాన్స్ మిస్ చేసుకుందనే చర్చ నందమూరి అభిమానుల్లో సాగుతోంది. మరి కాజల్ ఎంట్రీపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

Exit mobile version