Liplock : రోజు రోజుకు కాలం మారుతోంది. జనాల ఆలోచనా ధోరణి మారిపోతుంది. రానురాను సినిమాలకు వచ్చే వాళ్ల సంఖ్య తగ్గిపోతుంది. కానీ యువత మాత్రం అధిక సంఖ్యలో చూడడంతో వారిని టార్గెట్ చేసి తీసే సినిమాల సంఖ్య పెరిగిపోయింది. ఈ క్రమంలో ఇండియాలో అత్యంత చెత్త సినిమాగా రికార్డు సృష్టించిన సినిమా ఒకటి ఉంది. ఈ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 ముద్దు సీన్లు ఉన్నప్పటికీ, అవి సినిమాకు ఏమాత్రం బతికించలేకపోయాయి. అంతటి డిజాస్టర్ అయిన సినిమా పేరు ఏంటో తెలుసా.. ‘త్రీజీ’
ఆ సినిమాలో కిస్సుల కింగ్ ఇమ్రాన్ హష్మీగానీ నటించాడని అనుకుంటున్నారా? అబ్బే అదేం లేదండి. అందులో ఆ హీరో లేడు. ఇంతకీ అందులో హీరో, హీరోయిన్లు ఎవరంటే నీల్ నితిన్ ముఖేష్, బాలయ్య హీరోయిన్ సోనాల్ చౌహాన్. ఇది 2013లో విడుదలై భారీ డిజాస్టర్ గా నిలిచింది. దేశవ్యాప్తంగా రూ. 5.9 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంతేకాదు అతి దారుణమైన రేటింగ్స్ పొందింది. ఈ హారర్ థ్రిల్లర్ ‘3జీ’కి షీర్షక్ ఆనంద్, శంతను రే చిబ్బర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.
Read Also:Covid Scam: కర్ణాటకలో కోవిడ్ స్కాం.. సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..!
బాలీవుడ్ లో ముద్దు సీన్ల సంప్రదాయం 20వ శతాబ్దం వరకు లేదు. అన్ని సినిమాలు కూడా ఏదో కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమాలే అన్నట్టు ఉండేవి. మసాలా కోసం సినిమాలో ఓ క్లబ్ సాంగ్ ఉండేది. అందుకోసం బాలీవుడ్ లో హెలెన్ లాంటి హీరోయిన్లు ఉండేవారు. మన తెలుగులో అయితే జ్యోతిలక్ష్మి, జయమాలిని, విజయలలిత, సిల్క్ స్మితలాంటి వారు ఉండేవారు. అక్కడైనా, ఇక్కడైనా హీరోయిన్లు ఒక పద్ధతి ప్రకారం నటించేవారు. అయితే, 1933లో కర్మ అనే సినిమా వీటన్నింటికీ బ్రేక్ ఇచ్చింది. అందులో తొలిసారి లిప్ టు లిప్ కిస్ సీన్ ఉంది. ఆ సినిమాలో హీరో హిమాన్షు రాయ్, అతని భార్య దేవికా రాణి మధ్య సిల్వర్ స్క్రీన్ పై తొలిసారి ముద్దు సీన్ కనిపించింది. ఆ తర్వాత ఎవరూ అంతదూరం వెళ్లలేదు. వాళ్లు భార్యాభర్తలు కాబట్టి ఎవరూ దానిని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.
ఎప్పుడైతే ఇరవయ్యో శతాబ్ధం మొదలైందో.. సరిగ్గా నాలుగు సంవత్సరాల తర్వాత అంటే 2004లో మర్డర్ అనే సినిమా వచ్చింది. అందులో హీరో ఇమ్రాన్ హష్మీ, మల్లికా షెరావత్ మధ్య 27 లిప్ లాక్ సీన్లు ఉన్నాయి. కథ పరంగా బాగుండటంతో అవీ, ఇవీ తోడై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అలా మొదలై ఇప్పటికి ఓటీటీకి వచ్చేసరికి విచ్చలవిడి శృంగారంగా మారిపోయింది. ఇప్పుడు హీరోయిన్లే ఐటమ్ సాంగ్స్ చేసేస్తున్నారు. క్లబ్ డ్యాన్సర్లు కనుమరుగైపోయారు. 2013 నుంచి చాలా సినిమాలు విడుదలైనప్పటికి.. 3జీ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. ఇకపోతే అదే ఏడాది విడుదలైన ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ చిత్రంలో లో 27 ముద్దు సీన్లు ఉన్నాయి. అలాగే రణ్ వీర్ సింగ్, వాణి కపూర్ నటించిన ‘బేఫిక్రే’ లో కూడా 25 లిప్ లాక్ సీన్లు ఉన్నాయి. భారతదేశంలో అతి చెత్త సినిమాగా 3జీ నిలిచింది.
Read Also:Heavy Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనద్రోణి.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు