NTV Telugu Site icon

BB 4 : హిట్ కాంబో..బాలయ్య, బోయపాటి మ‌రో చిత్రానికి ముహూర్తం ఫిక్స్

New Project 2024 10 12t112655.053

New Project 2024 10 12t112655.053

BB 4 : నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను నాలుగో చిత్రానికి సన్నాహాలు మొదలయ్యాయి. బాలయ్య – బోయపాటి హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. బాలయ్యకు పెద్ద కమర్షియల్ చిత్రాలే కాకుండా తన కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాలుగా నిలిచాయి. ఆ క్రెడిట్ కచ్చితంగా బోయపాటికే దక్కుతుంది. తాజాగా రామ్ ఆచంట, గోపీ ఆచంట, 14 రీల్స్ ప్లస్, ఎమ్ తేజస్విని నందమూరి సమర్పణలో #BB4 అక్టోబర్ 16న ఉదయం 10 గంటలకు గ్రాండ్ ఓపెనింగ్ జరుగనుంది.

Read Also:Visvambhara : గూస్ బంప్స్ తెప్పించిన విశ్వంభర టీజర్.. ఇది వేరే లెవల్

బాలకృష్ణ, బోయపాటి శ్రీను నాల్గవ సారి కలిసి నటిస్తున్న #BB4 చిత్రం దసరా సందర్బంగా అధికారికంగా ప్రకటించబడింది. లెజెండ్ నిర్మాతలుగా ఉన్న రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై #BB4ని భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. బాలయ్య చిన్న కూతురు ఎం తేజస్విని నందమూరి ఈ చిత్రాన్న సమర్పిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో నాలుగో సినిమాగా BB4 వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాని అనౌన్స్ చేసారు. అక్టోబర్ 16న ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి మూహూర్తంగా నిర్ణయించారు. త్వరలోనే షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. రిలీజ్ చేసిన పోస్టర్లో BB4 అని వర్కింగ్ టైటిల్ పెట్టి వెనుక అమ్మవారి ఫోటో పెట్టడంతో ఇది అఖండ 2 సినిమానేనా లేక వేరే సినిమానా అని ఆలోచన చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.

Read Also:ICICI Bank Scam Case: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ స్కామ్.. సెల్పీ వీడియోతో బ్యాంక్‌ మేనేజర్ సంచలనం..

Show comments