Bhagavanth Kesari : నటసింహ నందమూరి బాలయ్య తన అభిమానుల కోసం పుట్టిన రోజు కానుక ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు చేస్తున్న 108 సినిమా ‘భగవంత్ కేసరి’ టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ తో అభిమానులలో ఫుల్ జోష్ ని నింపారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదలైన కాసేపట్లోనే టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్ రికార్డులు క్రియేట్ చేస్తోందనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ లుక్, ఫస్ట్ లుక్‌కి హ్యూజ్ రెస్పాన్స్ రాగా, ఈ టీజర్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి అభిమానులను బాగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మరోసారి రెచ్చిపోయాడు. ఈ టీజర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కౌర్ తో సినిమాలో మ్యూజిక్ ఏ రేంజులో ఉంటుందో ముందే సంకేతాలు పంపాడు.
Read Also:Yogi Government: 5 ఏళ్ల ట్రాఫిక్ చలాన్లు రద్దు.. యోగి సర్కార్ సంచలన నిర్ణయం
ఈ రోజు ఉదయం 10 గంటల 19 నిమిషాలకు భగవంత్ కేసరి టీజర్ ని రిలీజ్ చేశారు. ఇది బాలయ్య 108వ సినిమా. దీంతో 108 థియేటర్స్ లో టీజర్ ని రిలీజ్ చేశారు. థియేటర్స్ లో బాలయ్య అభిమానులు భారీగా సందడి చేశారు. హైదరాబాద్ శ్రీ భ్రమరాంబ థియేటర్ లో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి టీజర్ లాంచ్ ని చిత్రయూనిట్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు, డైరెక్టర్ అనిల్ రావిపూడి పాల్గొన్నారు. బాలయ్య అభిమానులు సందడి చేశారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి గతంలో ఎన్నడూ లేని విధంగా బాలయ్యను ప్రెజెంట్ చేశాడు. బాలయ్య 108వ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, టాలీవుడ్ క్రష్ శ్రీలీల బాలయ్య బాబుకు కూతురుగా కనిపించనుంది. బాలయ్య, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా బాలయ్య అభిమానులకు పుట్టినరోజు ట్రీట్ ఇచ్చింది. ‘భగవంత్ కేసరి’ని దసరాకు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తుంది చిత్ర యూనిట్.
Read Also:Union Bank of India: నేటి నుంచి ఏపీలోని 120 యూబీఐ శాఖల్లో ఈ సేవలు