NTV Telugu Site icon

Nandamuri Balakrishna: నేనున్నాను.. నేను వస్తున్నాను..!

Balayya

Balayya

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. చంద్రబాబు అరెస్ట్, జైలుకు తరలించడం వంటి పరిణామాలను తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. చంద్రబాబు రిమాండ్‌కు తరలించడాన్ని కొందరు తట్టుకోలేక పోయారని దాంతో గుండెపోటుతో మరణించడం, మరికొందరు వీరాభిమానులు సుసైడ్ చేసుకున్నారని పేర్కొన్నారు.

Read Also: Libya Floods : లిబియాలో వినాశనం.. వరదల ధాటికి 2 వేల మందికి పైగా మృతి

ఇలాంటి విషాద ఘటనలు తమ దృష్టికి వచ్చినట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో కుటుంబాలకు పెద్ద దిక్కును కోల్పోయిన ఆయా కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందని బాలయ్య బాబు అన్నారు. త్వరలోనే ప్రతీ కుటుంబాన్ని తాను కలవబోతున్నట్లు ఈ సందర్భంగా నేనున్నాను.. మీ వద్దకు వస్తాను అని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు.

Read Also: Ponguleti: పార్టీకి నష్టం కలిగించొద్దు.. ఇప్పటికే పలుచన అవుతున్నాం

ఇక, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టబోతున్నారా? అంటే అవును అనే సమాధానం వస్తుంది. ఇక ప్రజల్లోకి వెళ్లాలని బాలయ్య బాబు నిర్ణయించుకున్నారు.. ఇందుకోసం ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు నాయడును అరెస్ట్ చేసిన తీరును తట్టుకోలేక కొందరు మరణించగా.. మరికొందరు అయితే ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Show comments