Site icon NTV Telugu

Balagam Venu : ‘బలగం’ వేణులో ఈ టాలెంట్ కూడా ఉందా?

Venu

Venu

బలగం సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాతో కమెడియన్ వేణు డైరెక్టర్ గా సత్తా చాటాడు.. పాతికెళ్ల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చిన వేణు కమెడియన్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. ఒక్కో సినిమాతో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ తర్వాత జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయ్యాడు. అనేక సినిమాల్లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఇటీవల దర్శకుడిగా మారి తెలంగాణ నేటివిటీతో బలగం సినిమా తీసి హిట్ కొట్టాడు…

ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నానితో సినిమా చేయబోతున్నాడు.. ఇదిలా ఉండగా.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వేణు సినిమాల్లోకి రాకముందు తను ఏం చేసాడో ఆసక్తికర విషయాలు తెలిపాడు. వేణు పేరెంట్స్ కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళని, తాను కూడా చిన్నప్పట్నుంచి ఆ కూరగాయలను అమ్మానని చెప్పాడు.. అంతేకాదు అందరిలో కాస్త స్పెషల్ గా ఉండాలని మార్సల్ ఆర్ట్ కూడా నేర్చుకున్నాడని చెప్పాడు..

అంతేకాదు మార్షల్ ఆర్ట్స్ లో రెండు సార్లు స్టేట్ ఛాంపియన్ గా కూడా విన్ అయ్యానని తెలిపాడు. చిన్నప్పట్నుంచి అందరూ తనని బాబూమోహన్ కి చుట్టంలా ఉన్నావని, కమెడియన్ లా కనిపిస్తున్నావని అంటుండటంతో సినిమాలపై ఆసక్తి పెరిగి సినిమాల్లోకి వచ్చినట్లు చెప్పాడు.. అదన్నమాట మనోడి టాలెంట్ గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు..

Exit mobile version