Balagam Movie: తెలంగాణ నేటివిటీతో తక్కువ బడ్జెతో నిర్మాణమై సూపర్ హిట్ గా నిలిచిన సినిమా బలగం. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నవ్వించి.. ‘జబర్దస్త్’ షోలో మరెన్నో స్కిట్లతో బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన వేణు యెల్దండి తొలిసారిగా మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేశారు. కమెడియన్ నుంచి హీరోగా మారిన ప్రియదర్శి నటించారు. కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కథానాయిక. సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మార్చి 3న ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ గా నిలిచింది. పల్లె వాతావరణం, కుటుంబ బంధాలు, అన్నాచెళ్లెల అనుబంధాలతో ప్రేక్షకుల మనస్సు గెలుచుకుంది. ఆడియెన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. మరోవైపు చిత్రంలోని ఎమోషనల్ సీన్స్, కుటుంబ నేపథ్య సన్నివేశాలు, తెలంగాణ ఆచారాలకు సంబంధించిన సందర్భాలు ఆడియెన్స్ చేత కంటతడి పెట్టించాయి. దీంతో ఈ చిత్రాన్ని ఊరూరా ప్రొజెక్టర్, తెరలు ఏర్పాటు చేసి మరీ ప్రదర్శించారు. అంటే సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో అర్థమవుతోంది. అటు బాక్సాఫీస్ వద్ద కూడా రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
Read Also:Rafael Nadal: ఫ్రెంచ్ ఓపెన్‌కు నాదల్ దూరం.. కెరీర్‌కు సంబంధించి సంచలన ప్రకటన
ప్రస్తుతం ఈ చిత్రాన్ని టీవీలోనూ ప్రదర్శించడంతో ఊహించని రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఏకంగా RRR రేటింగ్ నే దాటేసింది. మే7న ఈ చిత్రాన్ని స్టార్ మాలో టెలికాస్ట్ చేశారు. తొలిసారిగా టీవీలో రావడంతో థియేటర్లలో మిస్ అయిన వారు వీక్షించారు. దీంతో 14.3 రేటింగ్ దక్కించుకొని బుల్లితెరపైనా ‘బలగం’ సత్తా చాటింది. ఆర్ఆర్ఆర్ కు 19 రేటింగ్ రావడం విశేషం. హైదరాబాద్ నగరంలో బలగానికి 22 రేటింగ్ రేటింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు బలగం చిత్రం అవార్డుల పంట కూడా పండిస్తోంది. అంతర్జాయతీయ స్థాయిలోనూ అవార్డులను సొంతం చేసుకుంటుండటం విశేషం. 40కిపైగా అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఈ ఏడాది జరుగుతున్న 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్స్ సిసిరోలియో అవార్డుని అందుకున్నాడు. ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఏకంగా 9 అవార్డులను సాధించింది.
