Bajaj Chetak 3503: బజాజ్ చేతక్ నుంచి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. సింగిల్ ఛార్జ్‌తో 151KM రేంజ్
- బజాజ్ చేతక్ నుంచి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల
- భారత్ లో కొత్త బజాజ్ చేతక్ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల
- సింగిల్ ఛార్జ్‌తో 151KM రేంజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతుండడంతో దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీలు ఈవీలను రూపొందించే పనిలో పడ్డాయి. లేటెస్ట్ ఫీచర్లతో తక్కువ ధరల్లోనే ఈవీ స్కూటర్లను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఈవీ లవర్స్ కు మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. బజాజ్ ఆటో భారత్ లో కొత్త బజాజ్ చేతక్ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. చేతక్ 35 సిరీస్‌లో ఇది అత్యంత చౌకైన మోడల్. దాని ఇతర మోడళ్లు డిసెంబర్ 2024లో విడుదలయ్యాయి. కంపెనీ బుకింగ్‌లను ప్రారంభించింది. కొన్ని నగరాల్లో దీని డెలివరీ మే 2025 మొదటి వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Also Read:India – Pakistan యుద్ధ చరిత్ర.. తప్పక తెలుసుకోవాల్సిందే !!
Also Read
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
బజాజ్ చేతక్ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్ లో రూ. 1,09,500 ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. ఇది 3501 కంటే రూ. 20,000 తక్కువ. బ్యాటరీ ప్యాక్, ఛాసిస్, 35-లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ మిగతా వాటితో సమానంగా ఉన్నాయి. ఇది 35 సిరీస్‌లో అత్యంత చౌకైన వేరియంట్. అయితే చౌకైనది చేతక్ 2903. ఇది చిన్న 2.9kWh బ్యాటరీతో వస్తుంది.
Also Read:Preity Zinta : అభిమానులకు క్షమాపణలు చెప్పిన స్టార్ హీరోయిన్..
చేతక్ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్ 3.5kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 151 కి.మీ వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. దీని గరిష్ట వేగం గంటకు 63 కి.మీ. 3502, 3501 గంటకు 73 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకెళ్తాయి. దీని బ్యాటరీ 0-80 శాతం ఛార్జ్ కావడానికి దాదాపు 3 గంటల 25 నిమిషాలు పడుతుంది.
Also Read:Preity Zinta : అభిమానులకు క్షమాపణలు చెప్పిన స్టార్ హీరోయిన్..
చేతక్ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రౌండ్ LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. టాప్ వేరియంట్‌లలో దీర్ఘచతురస్రాకార TFT కన్సోల్ ఉంటుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్, కాల్ మేనేజ్‌మెంట్ వంటి లక్షణాలను కలిగి ఉంది. కానీ దీనికి టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్ లేదు. 3503 లో డ్రమ్ బ్రేక్ అందించారు. ఇది హిల్ హోల్డ్ అసిస్ట్, రెండు రైడ్ మోడ్‌లు (ఎకో, స్పోర్ట్) ఇతర వేరియంట్‌ల మాదిరిగానే ఆల్-LED లైటింగ్ ఫీచర్‌లను కలిగి ఉంది. చేతక్ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండిగో బ్లూ, బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, మ్యాట్ గ్రే అనే నాలుగు కలర్స్ లో లభిస్తుంది.
తాజావార్తలు
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!