NTV Telugu Site icon

Bajaj Chetak: మరింత ఎక్కువ రేంజ్‌తో బజాజ్ చెతక్ ఈ-స్కూటర్..108కి.మీ మైలేజ్‌!

8

8

పాపులర్ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ నుంచి చెతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు త్వరలోనే అప్‍డేటెడ్ వెర్షన్ రానుంది. కొత్త వెర్షన్-2023 చెతక్ స్కూటర్ మరింత ఎక్కువ రేంజ్‍ను ఇవ్వనుందని సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న దాని కంటే సుమారు 20 శాతం ఎక్కువ రేంజ్‍ను కలిగి ఉంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 108 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా బజాజ్ చెతక్ కొత్త వెర్షన్ రేంజ్ ఉండనుంది. 2.88 కిలో వాట్ హవర్ (kWh) బ్యాటరీ ఉన్న ప్రస్తుత మోడల్ 90 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది. బజాజ్ చెతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వెర్షన్‍కు సంబంధించిన ఆర్టీవో డాక్యుమెంట్లు కూడా బయటికి వచ్చాయి. పూర్తి వివరాలు ఇవే..

బ్యాటరీ అదే.. కానీ రేంజ్‌ ఎక్కువే

బజాజ్ చెతక్ అప్‍డేటెడ్ వెర్షన్‍ కూడా 2.88 kWh బ్యాటరీనే కలిగి ఉంటుంది. అయితే సాఫ్ట్‌వేర్ మార్పుల కారణంగా ప్రస్తుత మోడల్ కంటే అదనంగా 20 శాతం ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. మొత్తంగా నయా వెర్షన్ 108 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని ఆర్టీవో డాక్యుమెంట్ ద్వారా తెలుస్తోంది. అయితే మోటార్ ఔట్‍పుట్ మాత్రం ప్రస్తుతం ఉన్న మోడల్‍లాగే ఉంటుందని సమాచారం. ఈ స్కూటర్ మోటర్ 4kW పవర్‌ను కలిగి ఉంటుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 70 కిటోమీటర్ల (70 kmph)గా ఉంది. ఈ కొత్త వెర్షన్‌తో రేంజ్ విషయంలో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్‍ను దాటేయనుంది. ప్రస్తుత ఐక్యూబ్ ఎస్ వేరియంట్ సింగిల్ చార్జ్‌పై 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తోంది. ప్రస్తుతం ఆథెర్ ఎక్స్450ఎక్స్ స్కూటర్ 146 కిలోమీటర్లు, ఓలా ఎస్1 ప్రో 170 కిలోమీటర్ల రేంజ్‍ను ఇస్తున్నాయి. వీటితోనూ చెతక్ పోటీ తీవ్రం కానుంది.

Also Read: Vivo Y100: కలర్ ఛేంజింగ్ ప్యానెల్‌తో వివో కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవే!