Vivo Y100: కలర్ ఛేంజింగ్ ప్యానెల్‌తో వివో కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో నుంచి మరో 5జీ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్‍లో రిలీజైంది. వివో వై100 (Vivo Y100) మొబైల్ ఇండియాలో నేడు లాంచ్ అయింది. వెనకాల కలర్ ఛేంజింగ్ ప్యానెల్‌తో ఈ మొబైల్ లుక్ మాత్రం అదిరిపోయింది. మీడియాటెక్ డైమన్సిటీ 900 ప్రాసెసర్, అమోల్డ్ డిస్‍ప్లేతో ఈ 5జీ ఫోన్ వస్తోంది. ఇప్పటికే సేల్ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో Vivo Y100 పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
స్పెసిఫికేషన్స్..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
కలర్ చేజింగ్ బ్యాక్ ప్యానెల్ ఈ వై100 స్మార్ట్ ఫోన్‍కు ఉంటుంది. సూర్యరశ్మి లేదా ఏదైనా ఎక్కువ కాంతి పడితే ఈ బ్యాక్ ప్యానెల్ కాస్త వేరే రంగుకు మారినట్లు కనిపిస్తుంది. ఇక 6.38 ఇంచ్ ఫుల్ హెచ్‍డీ+ డిస్‍ప్లేతో ఈ ఫోన్ వస్తోంది. హెచ్‍డీఆర్ 10+, 1300 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, 90 హెర్ట్జ్ (Hz) రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మీడియాటెక్ డైమన్సిటీ 900 ప్రాసెసర్‌పై వివో వై100 ఫోన్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్‍టచ్ ఓఎస్ 13తో వస్తోంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలు వెనుక ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ వివో నయా ఫోన్ వస్తోంది. అలాగే Vivo Y100 ఫోన్‍లో 4,500mAh బ్యాటరీ ఉంది. 44 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. డ్యుయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్‍టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5mm హెడ్‍ఫోన్ జాక్, యూఎస్‍బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.
ధర..
వివో వై100 ఒకే వేరియంట్‍లో అందుబాటులోకి వచ్చింది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉండే ఈ ఫోన్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.24,999గా ఉంది. వివో అధికారిక వెబ్‍సైట్, ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍లో సేల్ కూడా మొదలైంది. ప్రస్తుతం వివో వెబ్‍సైట్‍లో హెచ్‍డీఎఫ్‍సీ, ఎస్‍బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో ఈ ఫోన్‍ను కొంటే రూ.1,000 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తోంది. అమెజాన్‍లో ప్రస్తుతం స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ కార్డులపై ఆఫర్ ఉంది. ఫ్లిప్‍కార్ట్‌లోనూ వివో వై100 అందుబాటులోకి రానుంది.
Also Read:సెనగపిండి ఎక్కువగా వాడుతున్నారా? అయితే, డయాబెటిస్ నుంచి మీకు రక్షణ లభిస్తున్నట్టే!
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!